IND vs Pak: భారత్ కు అభిషేక్ భయం..? అప్పటికి కోలుకుంటాడా..?
టి20 వరల్డ్ కప్ సందడి మొదలైన దగ్గరి నుంచి భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. భారత్ తో పాటు ఆస్ట్రేలియా కూడా గాయాలతో ఇబ్బంది పడుతోంది. భారత కీలక ఆటగాళ్ళు వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, బూమ్రా సహా పలువురు ఆటగాళ్ళు గాయాలు, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల బూమ్రా కోలుకున్నప్పటికీ.. అభిషేక్ శర్మ(Abhishek Sharma) విషయంలో మాత్రం ఆందోళన మొదలైంది. గత ఏడాది కాలంగా భారత జట్టుకు అతను అత్యంత కీలకంగా మారాడు.
ఓపెనర్ గా భారత జట్టు విజయాల్లో అతను కీలక పాత్ర పోషించడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి అభిషేక్ ఇప్పుడు వచ్చే ప్రపంచ కప్ మ్యాచ్ లు ఆడతాడా లేదా అనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. పాకిస్తాన్ తో ఉన్న మ్యాచ్ సమయంలో అతను అనారోగ్యం పాలు కావడం భారత ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. అభిషేక్ శర్మ కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవలసి వచ్చింది.
ఇవి కూడా చదవండి
కొద్దిసేపటికే అతను డిశ్చార్జ్ అయినప్పటికీ, ఆటకు పూర్తిగా ఫిట్‌గా లేడని టీం ఇండియా వర్గాలు తెలిపాయి. అభిషేక్ అందుబాటులో లేకపోవడంతో, సంజు సామ్సన్(Sanju Samson) ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్ చేయగా.. అతను ఎనిమిది బంతుల్లోనే 22 పరుగులు చేసి కాస్త ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ కు అభిషేక్ అందుబాటులో లేకపోతే అది పెద్ద దేబ్బగానే చెప్పుకోవచ్చు. సంజూ ఫాంలో లేకపోవడంతో అభిషేక్ లేని లోటు కనపడుతోంది. ఇషాన్ కిషన్ ఆడుతున్నా.. అభిషేక్ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం బలపడుతోంది. అయితే అభిషేక్ ప్రాక్టీస్ సెషన్ కు హాజరైనా.. ఎక్కువ సేపు మైదానంలో కనపడలేదు. కాగా ఈ నెల 15 న కొలంబోలో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనుంది.
ఇవి కూడా చదవండి













