T20 World Cup: పసికూనలు కాదు.. డైనమైట్ లు..!
ప్రపంచకప్ లు అనగానే చిన్న జట్లను చాలా మంది తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఆ జట్ల ప్రదర్శన విషయంలో పెద్దగా ఎవరికీ ఆశలు ఉండవు. కానీ ఈ టి20 వరల్డ్ కప్ లో మాత్రం పసికూనలు పెద్ద జట్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా(USA), నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్లు తమ ప్రదర్శనతో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారత్ తో జరిగిన మ్యాచ్ లో నమీబియా జట్టు కూడా ఆకట్టుకుంది. టాప్ ఆర్డర్ ను, లోయర్ ఆర్డర్ ను ఆ జట్టు బౌలర్ లు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే.
ఇక అమెరికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఇబ్బంది పడింది. నేపాల్ శ్రీలంకకు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా గ్రూప్ దశలో జరిగిన పోరులో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను(Australia Vs Zimbabwe) ఓడించింది. అది కూడా తక్కువ పరుగులు చేసినా సరే బౌలింగ్ లో సత్తా చాటింది జింబాబ్వే జట్టు. దీనితో చిన్న జట్లు కాదు.. డైనమైట్ లు అంటూ క్రికెట్ అభిమానులు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పెద్ద జట్టు కూడా చిన్న జట్లపై 200 లకు పైగా స్కోరు అంత ఈజీగా చేయలేదు అనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి
నిన్న భారత్.. నమీబియాపై 209 పరుగులు చేయడానికి నానా కష్టాలు పడింది. ఇప్పుడు ఆస్ట్రేలియా.. 160 పరుగులకు పైగా లక్ష్యాన్ని చేధించేందుకు తీవ్రంగా కష్టపడి.. చివరికి ఓటమి పాలైంది. 2022 నుంచి చిన్న జట్ల ప్రదర్శన ఇలాగే ఉంది. గత ప్రపంచ కప్ లో అమెరికా.. పాకిస్తాన్ ను ఓడించింది. 2022లో, నమీబియా శ్రీలంకను ఓడించిన సంగతి తెలిసిందే. అలాగే ఐర్లాండ్ ఇంగ్లాండ్‌పై అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీనితో భవిష్యత్తులో చిన్న జట్లను తక్కువ అంచనా వేయకూడదు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
ఇవి కూడా చదవండి













