Nara Lokesh: కుటుంబాలను దగ్గర చేస్తున్న లోకేష్..!
సాధారణంగా రాజకీయాల్లో నిలబడాలంటే నాయకులతో సఖ్యత ఎంతో కీలకంగా ఉంటుంది. ఏ నాయకుడైనా సరే ఇతర నాయకులతో సరిగా లేకపోతే రాజకీయాల్లో ముందుకు వెళ్లడం సాధ్యం కాదు. ఇక భవిష్యత్తు నాయకుడిగా ఓ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నప్పుడు ఆ నాయకుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని ముందే గ్రహించారు ఏపీ మంత్రి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ(TDP) భవిష్యత్తు నాయకుడిగా చెప్పుకుంటున్న నారా లోకేష్ ఇప్పుడు ఇతర నాయకులతో అనుసరిస్తున్న వైఖరి ఆశ్చర్యపరిచింది. అసెంబ్లీ సమావేశాలు(Budget Session) మొదటి రోజు నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీ కుటుంబాలతోలతో ఆయన మమేకమవుతున్నారు.
ఇవి కూడా చదవండి
వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఓ పార్లమెంటు నియోజకవర్గం.. రాయలసీమ నుంచి మరో పార్లమెంటు నియోజకవర్గం నుంచి పిలిచి వారితో డిన్నర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు లోకేష్. దీనికి టిడిపి నేతల నుంచి మంచి స్పందన వస్తోంది. అలాగే దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా అందరితో లోకేష్ మమేకమవుతున్నారు. తాజాగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో లోకేష్ మమేకమైన విధానం.. చాలామందికి నచ్చేసింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో లోకేష్ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా అలాగే మాట్లాడుతున్నారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా సభ వాయిదా పడిన తర్వాత అయ్యన్నపాత్రుడుని స్వయంగా ఆయన కారు వద్ద దింపి వెళ్లారు లోకేష్. సాధారణంగా ఎమ్మెల్యేలు కలుస్తారు గానీ.. వారి కుటుంబాలను కూడా మంత్రి కలపడం గమనార్హం. ఇలాగే అందరి నేతలతో కూడా లోకేష్ సన్నిహితంగా మెలగడంతో.. అటు జనసేన పార్టీ కూడా ఆశ్చర్యపోతోంది. లోకేష్ ను ఒకప్పుడు విమర్శించిన వారు కూడా.. ఇప్పుడు జై కొడుతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడే సమయంలో కూడా లోకేష్ దూకుడు ప్రదర్శించడం ఆయనను విమర్శించిన వాళ్లకు కూడా నచ్చుతోంది. తాజాగా అంబటి రాంబాబు వ్యవహారంలో వైసీపీ నేతలు శాసనమండలిలో ప్రస్తావన తీసుకురావడంతో.. హోంమంత్రి అనితకు మద్దతుగా నారా లోకేష్ వైసీపీ నేతలకు ఇచ్చిన కౌంటర్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి













