Yemo Yemo Idi: ఆకట్టుకుంటున్న ‘ఏమో ఏమో ఇది’ గ్లింప్స్
దర్శకుడు డా. శైలేష్ కొలను, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ సరికొత్త రొమాంటిక్ కామెడీ సినిమా కోసం చేతులు కలిపారు. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఏమో ఏమో ఇది’ అనే అందమైన టైటిల్ ను ఖరారు చేశారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను ఆవిష్కరించారు.
“ఏమో ఏమో ఇది” అనే టైటిల్ వినగానే ఉల్లాసమైన ప్రేమ భావనలు మనసులో మెదులుతున్నాయి. చిత్ర ప్రకటన సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ తల్లి–కొడుకుల మధ్య సరదా సంభాషణతో ప్రారంభమవుతుంది. నవతరం ప్రేమ బంధాలు, ఆధునిక వివాహాలు వంటి అంశాలను వినోదాత్మకంగా చూపించారు. గ్లింప్స్‌లో కథానాయిక తన ప్లేలిస్ట్‌లోని అలనాటి క్లాసిక్ పాటను ఆస్వాదిస్తూ కనిపిస్తుంది. ఆ సన్నివేశం ద్వారా ఆమె లోతైన భావోద్వేగ అనుబంధాన్ని, ప్రేమను ఎంతో అందంగా ఆవిష్కరించారు.
ఇవి కూడా చదవండి
మీ రాశి ప్రకారం లక్కి కలర్స్ నంబర్లు ఇవే..
సాఫ్ట్వేర్ జాబ్ వదిలేశాడు.. ఆటో పట్టాడు.
ప్రేమలో ఇచ్చే 7 అందమైన వాగ్దానాలు
బ్లాక్‌బస్టర్ ‘హిట్’ యూనివర్స్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు శైలేష్ కొలను, “ఏమో ఏమో ఇది” ద్వారా పూర్తిగా కొత్త జానర్లో అడుగుపెడుతున్నారు. ఇదే ఆయన తొలి రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇంతకుముందు తీవ్రత, యాక్షన్‌తో కూడిన ఉత్కంఠభరిత ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లను అందించిన ఆయన, ఇప్పుడు హృద్యమైన, హాయిగా సాగే, సరదాగా నవ్వించే సరికొత్త ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
అభయ్ పాత్రలో రోషన్ మేకా నటిస్తున్నారు. తొలి చిత్రం ‘పెళ్లి సందడి’ ద్వారా ఆకట్టుకున్న ఆయన, ఇటీవల ‘ఛాంపియన్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ ‘ఏమో ఏమో ఇది’ చిత్రంలో నేటి జెన్ జీ తరం ప్రేమను ఆవిష్కరించే పక్కింటి అబ్బాయి తరహా ఆకర్షణీయమైన పాత్రలో రోషన్ కనిపించనున్నారు.
అపూర్వ పాత్రలో ప్రీతి ముకుందన్ కనిపించనున్నారు. గ్లింప్స్‌లోనే ఆమె ఉత్సాహభరితమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అపూర్వ పాత్రలో సరికొత్తగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండటం అదనపు ఆకర్షణ. తన మధురమైన పాటలతో అనతికాలంలో గొప్ప సంగీత దర్శకుడిగా పేరుపొందిన ఆయన, తన అద్భుతమైన సంగీతంతో ఈ ప్రేమ ప్రపంచాన్ని మరింత అందంగా మలచనున్నారు. గ్లింప్స్ లోనే తనదైన నేపథ్య సంగీతంతో మాయ చేశారు. అలాగే ఛాయాగ్రాహకుడు వంశీ పచ్చిపులుసు అందించిన అందమైన, హాయిగా కనిపించే విజువల్స్.. ఆహ్లాదకరమైన ప్రేమ వాతావరణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాయి.
ఇవి కూడా చదవండి
మీ రాశి ప్రకారం లక్కి కలర్స్ నంబర్లు ఇవే..
సాఫ్ట్వేర్ జాబ్ వదిలేశాడు.. ఆటో పట్టాడు.
ప్రేమలో ఇచ్చే 7 అందమైన వాగ్దానాలు
2026 ఆరంభంలో “అనగనగా ఒక రాజు”తో ఘన విజయాన్ని అందుకున్న నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది.
2026 దసరా కానుకగా చిత్రo విడుదల అవుతుంది.
“ఏమో ఏమో ఇది” చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.













