మంచి డేట్ ను ప‌ట్టేసిన నాని

14th February 2026

White Scribbled Underline

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా ది ప్యార‌డైజ్.

ఇప్ప‌టికే నాని, శ్రీకాంత్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన ద‌స‌రా మంచి బ్లాక్ బ‌స్ట‌ర్.

ద‌స‌రా త‌ర్వాత నాని, శ్రీకాంత్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో ది ప్యార‌డైజ్ పై మంచి అంచ‌నాలు.

ది ప్యార‌డైజ్ రా స్టేట్‌మెంట్ కు ఆడియ‌న్స్ నుంచి విప‌రీత‌మైన రెస్పాన్స్.

మార్చి 26న ది ప్యార‌డైజ్ ను రిలీజ్ చేస్తామ‌ని చెప్పిన మేక‌ర్స్, షూటింగ్ ఆల‌స్య‌మ‌వ‌డం వ‌ల్ల సినిమాను పోస్ట్‌పోన్ చేశారు.

ఆగ‌స్ట్ 21న ది ప్యార‌డైజ్ సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ తాజాగా మ‌రో పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు.

వ‌రుస స‌క్సెస్‌ల‌తో కెరీర్లో దూసుకెళ్తున్న నాని, ఈ సినిమా త‌ర్వాత స్టార్ హీరో రేంజ్ కు వెళ్తాడ‌ని అంద‌రూ భావిస్తున్నారు.

ది ప్యార‌డైజ్‌ను మేకర్స్ భారీ బడ్జెట్‌తో, కొత్త కాన్సెప్ట్‌తో గ్రాండ్ స్కేల్‌లో రూపొందిస్తున్నట్లు సమాచారం. ద‌స‌రా తరహాలోనే మరో పవర్‌ఫుల్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని, ది ప్యార‌డైజ్‌తో మరింత పెద్ద స్టార్‌డమ్‌ను అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలవొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.