Yuganiki Okkadu: క్రేజీ సీక్వెల్ పై డైరెక్టర్ సంచలన కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు రిలీజ్ సమయంలో పెద్దగా గుర్తింపు పొందకపోయినా, కాలక్రమేణా కల్ట్ స్టేటస్ సంపాదించుకుంటాయి. అలాంటి చిత్రాల్లో యుగానికి ఒక్కడు(Yuganiki Okkadu) ఒకటి. కార్తీ(Karthi) హీరోగా, సెల్వ రాఘవన్(Selva Raghavan) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ టైమ్ లో ఓ మోస్తరు రెస్పాన్స్ ను అందుకున్నప్పటికీ, తర్వాత విపరీతమైన అభిమానాన్ని దక్కించుకుని ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ సీక్వెల్‌ను కార్తీతో కాకుండా ఆయన సోదరుడు ధనుష్(Dhanush) హీరోగా సెల్వ రాఘవన్ ప్రకటించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దర్శకుడు-హీరో అన్నదమ్ములు కావడంతో ఈ సినిమా త్వరగా ప్రారంభమవుతుందని భావించినప్పటికీ, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు.
దీంతో ఈ సీక్వెల్ భవితవ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. రీసెంట్ గా ఈ విషయంపై స్పందించిన సెల్వ రాఘవన్, కథ రెడీగా ఉన్నప్పటికీ సీక్వెల్ చేయాలంటే డైరెక్టర్ మాత్రమే కాదు, మిగతా వారు కూడా రెడీగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఆయన మాటల ప్రకారం చూస్తే ఈ ప్రాజెక్టు విషయంలో కార్తీ నుంచి పూర్తి స్థాయి ఆసక్తి లేదనే భావన వ్యక్తమవుతోంది. మరి ఈ సీక్వెల్ కేవలం వార్తగానే మిగిలిపోతుందేమో చూడాలి.













