Chicago Andhra Association: ఉత్సాహంగా చికాగో ఆంధ్ర సంఘం వారి పల్లె సంబరాలు
చికాగో ఆంధ్ర సంఘం వారి పల్లె సంబరాలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 31, 2026 తేదీన హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో సంబరాలు ఆంధ్ర సంఘం ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ముచ్చటైన అలంకరణలు, ముద్దులొలికే చిన్నారుల ముద్దు ముద్దు నాట్యాలు, అలరించిన ఆడపడుచుల ఆటపాటలు – నవ్వించే వినోదాత్మకమైన నాటికలు, ఉద్వేగ భరితమైన దేశభక్తి గీతాలు- ఉత్సాహపరిచే ప్రేక్షకులు, రుచికరమైన వంటలు – ఆప్యాయంగా వడ్డీంచే స్వచ్చంద సేవకులతో ఈ కార్యక్రమము అంగరంగ వైభవంగా ఆద్యంతం వినోదాత్మకంగా జరిగింది.
2026 సంవత్సరానికి సంస్థ అధ్యక్షురాలైన తమిశ్రా కొంచాడ, చైర్మన్ రాఘవ జాట్ల, మరియు ఇతర కార్యవర్గ సభ్యులు, స్పాన్సర్స్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి చికాగో చుట్టుప్రక్కల ప్రాంతాలనుండి 1000 మందికి పైగా ఆహ్వానితులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సంస్థ అధ్యక్షురాలు తమిశ్రా కొంచాడగారి ప్రారంభ ఉపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి, శృతి కూచంపూడి గారి ఆధ్వర్యంలో, సంస్థ అధ్యక్షురాలు తమిస్రా కొంచాడ, సుభాష్ చేపలమడుగు, పద్మజ గండ్ర గారి సహకారంతో అకేషన్ బై కృష్ణ – కృష్ణ జాస్తి భారత గణతంత్రదినోత్సవ స్పూర్తిని ప్రతిబింబించేలా సభా వేదికను, సభా ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు.
సంస్థ అధ్యక్షురాలు తమిశ్రా కొంచాడ, సంస్థ 2026 సంవత్సర కార్యవర్గ సభ్యులను ఒక వినూత్నరితిలో సభ్యులకు పరిచయం చేసారు. ఈ సందర్భంగా సంస్థ 2025 అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లిగారి సేవలను గుర్తిస్తూ వారిని సత్కరించారు.
ఈ కార్యక్రమానికి సంస్థ ఉపాధ్యక్షులు రామకృష్ణ తాడేపల్లి, 2024- 2025 సంవత్సరాలకు చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ పెదమల్లు, 2025 సంవత్సరానికి అధ్యక్షులైన శ్రీకృష్ణ మతుకుమల్లి, శ్రీనివాస్ సుబుద్ది, ప్రభాకర్ మల్లంపల్లి, సుగుణ రామదాసు, సంస్థ ట్రస్టీలు సుజాత – పద్మారావు అప్పలనేని, ఉమా కటికి, భార్గవి – ప్రసాద్ నెట్టెం, పవిత్ర – దినకర్ కరుమూరి, రాఘవ – శివ బాల జాట్ల గార్లు కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాలగా కావలసిన సహాయ సహకారాలను అందించారు.
శైలజ సప్ప ఆధ్వర్యంలోని సాంస్కృతిక విభాగం, స్వర్ణ నీలపు మరియు రమ్య మైనేని సహకారంతో విలక్షణమైన సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించి పల్లె సంబరాలకు వచ్చిన ఆహ్వానితులను రంజింప చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన యశోద వెదుల, గౌరీ అద్దంకి, డాక్టర్ సుందరవల్లి తమ మాటల గారడితో కార్యక్రమాన్ని ఆద్యంతం రసవత్తరంగా నడిపించారు.
30 మందికి పైగా కళాకారులతో ఉద్వేగ భరితమైన దేశభక్తి గీతాలతో చేసిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులను తన్మయత్నానికి గురిచేసింది. ఈ మొత్తం కార్యక్రమంలో 250మందికి పైగా కళాకారులు 30 కి పైగా సంస్కృతిక ప్రదర్శనలు చేసారు.
ఇవి కూడా చదవండి
ఇక ఈ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ పద్మజ, నరసింహ రెడ్డి ఒగ్గు గారు రచన, దర్శకత్వంలో రూపొందించిన “యముగోల ” దృశ్యరూపకం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వేలా చేసింది.
చికాగో ఆంధ్ర ఆడపడుచులు దేశభక్తిని, ఇంకా సంక్రాంతి సంబరాలను ప్రతిబింభించేలా చేసిన నృత్య ప్రదర్శనలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి కావలసిన సాంకేతిక సహకారాన్ని చైతన్య ఈదర, సురేష్ గ్రంధి, స్రవంతి గ్రంధి అందించారు.
సాహితీ ఆదిమూలం, పద్మారావు అప్పలనేని గారి బృందం కార్యక్రమానికి వచ్చిన అతిధుల సభ్యత్వాలు నమోదు చేసుకుని పల్లె సంబరాల కోసం శైలేష్ మద్ది, శ్రీని పద్యాల గారు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన క్యాలెండర్ను అందజేశారు.
సురేష్ కుమార్ అయినపూడిగారి పర్యవేక్షణలో బావర్చి బిరియానీస్ – Naperville నుండి ప్రవీణ్ వేములపల్లి గారు ఈ వేడుక కోసం పసందైన విందు భోజనాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. రుచికరమైన పదార్థాలను సాంప్రదాయమైన పాత్రలలో తెలుగుదనం ఉట్టిపడేలా భారత జాతీయ పతాకంలోని రంగులతో చేసిన అలంకరణ ఆహ్వానితులను సంభ్రమాచర్యాలకు గురిచేసింది. స్వచ్ఛంద సేవకులు రుచికరమైన భోజనాన్ని అతిధులకు కొసరి కొసరి వడ్డించారు. పిజ్జా ట్విస్ట్ వారు ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లల కోసం పిజ్జాలను అందజేశారు.
చికాగో ఆంధ్ర సంఘం వ్యవస్థాపకులలో ఒకరైన సుజాత అప్పలనేని గారి సారధ్యంలో ప్రతి సంవత్సరంలాగానే ఈసారి కూడా సాంప్రదాయ పద్ధతిలో నేతి అరిసెలు చేశారు. ఈ కార్యక్రమంలో తమిశ్రా కొంచాడ, ప్రియా మతుకుమల్లి, హరిణి మేడ, పద్మజ గండ్ర, శృతి కూచంపూడి, శ్వేత కొత్తపల్లి, మోహిని చేపలమడుగు, ప్రశాంతి తాడేపల్లి, స్వప్న మహాళి, రమ్య కొత్తమాసు, స్మిత నండూరి, రమ్య మైనెని, సరిత ఆయనపూడి, స్వర్ణ నీలపు, సుప్రియ మద్ది పాల్గొని అతిధులకు కావలసిన అరిసెలను తయారు చేశారు. వీరికి శ్రీకృష్ణ మతుకుమల్లి, రామకృష్ణ తాడేపల్లి, శ్రీనివాస్ సుబుద్ది కావలసిన సహాయాన్ని అందించారు.
ధర్మేంద్ర గాలి, పల్లె సంబరాలు సజావుగా జరగడానికి కావలసిన వస్తువులను సమకూర్చడం జరిగింది.
సురేష్ మహాళి, రామారావు కొత్తమాసు ఈ కార్యక్రమానికి వచ్చిన సమర్పకులు (Sponsors) కి కావలసిన సదుపాయాలను సమకూర్చారు.
సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటైన సేవా నెరతిని ముందుకు తీసుకువెళ్లే సంకల్పంతో స్థాపించిన చికాగో ఆంధ్ర ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను, తాము ముందు ముందు చేపట్టనున్న సేవా కార్యక్రమాల వివరాలను CAF తరపున సునీత రాచపల్లి గారు సవివరముగా దృశ్య రూపములో ప్రదర్శించారు. వీరికి హరిణి మెడ, డాక్టర్ ఉమా కటికి, రమ్య కొత్తమాసు కావలసిన సహాయాన్ని అందించారు.
గత కొన్ని సంవత్సరాలనుండి నిరంతరం వివిధ సేవా కార్యక్రమాలతో సమాజసేవ చేస్తున్న శ్రీనివాస్ పెద్దమల్లు, దినకర్ కారుమూరి గారి కుటుంబాల సేవలను కొనియాడుతూ వారిని సత్కరించారు. CAF విరాళాల సేకరణకై నిర్వహించిన రాఫెల్ నందు విజేతలైన వారికి బహుమతులు అందజేశారు.
ఇవి కూడా చదవండి
ఈ కార్యక్రమానికి కావలసిన Digital and Web సహకారాన్ని మురళి రెడ్డివారి సమాకూర్చారు.
కిరణ్ వంకాయలపాటి ఈ కార్యక్రమం ఆద్యంతం వివిధ రకాల సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్ష ప్రసారం కావడానికి కావలసిన ఏర్పాట్లను చేశారు
శ్రీస్మిత నండూరి, శ్రీయ కొంచాడ, దివిజ చల్లా, జైఆనికేత్ మేడబోయిన, జిష్ణు వీరపనేని కార్యక్రమం సజావుగా జరగడానికి కావాలసిన యువ స్వచ్చంద సేవకులను సమన్వయం చేసి, యువత సేవలను ఉపయోగించుకున్నారు.
చివరగా సంస్థ తరపున కార్యదర్శి ఒగ్గు నరసింహ రెడ్డి గారు ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కజేయకుండా కార్యక్రమానికి విచ్చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి కళాకారులను తమ కరతాల ధ్వనులతో, ఈలలతో ఉత్సాహపరచిన ఆహ్వానితులు అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత రెండు నెలలుగా పల్లె సంబరాలను విజయవంతంగా నిర్వహించడం కోసం అహర్నిశలు శ్రమించిన సంస్థ ప్రతినిధులకు, కార్యవర్గ సభ్యులకు, పూర్వ అధ్యక్షులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, స్పాన్సర్స్ కు, పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసి, జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ముగించారు.
ఇవి కూడా చదవండి













