Hasith Goli: సిద్దూ స్వాగ్ ఎలా ఉంటుందో?
రాజ రాజ చోర(raja raja chora), స్వాగ్(Swag) సినిమాలతో భిన్నమైన కథనం, వినూత్న హ్యూమర్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు హసిత్ గోలి(hasith Goli) ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈసారి ఆయన డీజే టిల్లు(DJ Tillu) ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda)తో చేతులు కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు(Dil Raju) బ్యానర్లో ఈ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కూడా వినోద ప్రధానంగానే ఉండనుందని సమాచారం. హసిత్ గోలి(Hasith Goli) తనకు సొంతమైన స్టైల్లో కామెడీకి కొత్త బ్యాక్‌డ్రాప్ జోడించేలా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, టైమింగ్‌కు హసిత్ హ్యూమర్ కలిస్తే ప్రేక్షకులకు నవరసాల వినోదం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇద్దరి కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన లైనప్‌లో టిల్లూ క్యూబ్(Tillu Cube) కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హసిత్ గోలి ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని అనుకూలిస్తే త్వరలోనే ఈ కాంబోపై స్పష్టత రానుంది. ప్రేక్షకులు మాత్రం ఈ క్రేజీ కలయిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి













