Vardhannapet: వర్ధన్నపేట మున్సిపల్ పోరులో రీకౌంటింగ్ రచ్చ.. రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు
Vardhannapet: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రీకౌంటింగ్‌లో ఫలితాలు తారుమారు అయ్యాయంటూ భారత రాష్ట్ర సమితి (BRS) నేతలు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు.
అసలేం జరిగిందంటే:
ఫలితం తారుమారు: 12వ వార్డులో తొలుత బీఆర్ఎస్ అభ్యర్థి 7 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. అయితే, రీకౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి 13 ఓట్లతో గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించడం వివాదానికి కారణమైంది.
పక్షపాత ధోరణి: 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థికి స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ, అధికార పార్టీ ఒత్తిడితో అధికారులు ఏకంగా నాలుగు సార్లు రీకౌంటింగ్ నిర్వహించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాము రీకౌంటింగ్ కోరిన చోట అధికారులు స్పందించడం లేదని వారు మండిపడుతున్నారు.
జాతీయ రహదారిపై బైఠాయింపు:
ఈ పరిణామాలపై సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, తన అనుచరులతో కలిసి వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని, పారదర్శకంగా రీకౌంటింగ్ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.













