API Sales Growth: వాన్బరీ లిమిటెడ్ లాభాల ప్రభంజనం.. క్యూ3లో 1,194 శాతం పెరిగిన నికర లాభం
API Sales Growth: గ్లోబల్ ఏపీఐ (API) మార్కెట్లోనూ, దేశీయంగా బ్రాండెడ్ ఫార్ములేషన్స్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ ఫార్మా కంపెనీ వాన్బరీ లిమిటెడ్ (Wanbury Ltd), 2025 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికానికి (Q3 FY26, తొమ్మిది నెలల వ్యవధికి (9M FY26) అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ లాభదాయకతలో భారీ వృద్ధిని నమోదు చేసింది.
2025 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసిక ఫలితాలు (Q3 FY26):
ఆదాయం: కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 162.4 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో (Q3 FY25) నమోదైన రూ. 133.5 కోట్లతో పోలిస్తే ఇది 21.7 శాతం వృద్ధి. ఏపీఐ వాల్యూమ్స్ పెరగడం, తయారీ ప్లాంట్లలో సామర్థ్యం మెరుగుపడటం ఇందుకు దోహదపడ్డాయి.
EBITDA: నిర్వహణ లాభం (EBITDA) రూ. 26.9 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది రూ. 14.8 కోట్లతో పోలిస్తే 81.7 శాతం పెరిగింది. మెరుగైన ప్రొక్యూర్మెంట్ వ్యూహాలు, సాల్వెంట్ రికవరీ సిస్టమ్స్ వల్ల EBITDA మార్జిన్లు 11.0% నుండి 16.5 శాతానికి మెరుగుపడ్డాయి.
నికర లాభం (PAT): కంపెనీ నికర లాభం ఏకంగా 1,194.3 శాతం వృద్ధి చెంది రూ. 1.2 కోట్ల నుండి రూ. 15.8 కోట్లకు చేరింది. వ్యయ నియంత్రణ, ఫైనాన్స్ వ్యయాలు తగ్గడం వల్ల PAT మార్జిన్ 0.9% నుండి 9.7 శాతానికి పెరిగింది.
తొమ్మిది నెలల వ్యవధి ఫలితాలు (9M FY26):
ఆదాయం: ఈ తొమ్మిది నెలల్లో మొత్తం ఆదాయం రూ. 485.7 కోట్లుగా నమోదైంది, ఇది గత ఏడాదితో పోలిస్తే 13.6 శాతం వృద్ధి.
లాభదాయకత: 9M FY26లో EBITDA రూ. 77.6 కోట్లుగా (60.6% వృద్ధి), నికర లాభం (PAT) రూ. 44.4 కోట్లుగా (332.5% వృద్ధి) నమోదయ్యాయి. ఫలితంగా PAT మార్జిన్ 2.4% నుండి 9.1 శాతానికి మెరుగుపడింది.
యాజమాన్యం వివరణ – కొత్త ఆవిష్కరణలు:
కంపెనీ పనితీరుపై డైరెక్టర్ మిస్టర్ మోహన్ రాయన మాట్లాడుతూ, కార్యకలాపాల పటిష్టత మరియు ఆర్థిక క్రమశిక్షణ వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
API విభాగం: తణుకు ప్లాంటు నుండి యూరోపియన్ కస్టమర్లకు ‘హై పొటెంట్ ఎనస్థటిక్ ఏపీఐ’ షిప్మెంట్ పూర్తయింది. రానున్న రోజుల్లో యాంటీడయాబెటిక్, రక్తాన్ని పలుచన చేసే యాంటీగోఆగ్యులెంట్, కాఫ్ సప్రెసంట్, యాంటీడిప్రెసంట్ వంటి కొత్త ఉత్పత్తులను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.
ఫార్ములేషన్స్: ఇటీవల ప్రవేశపెట్టిన న్యూట్రిషనల్ సప్లిమెంట్ ‘C-Red’, ఇతర ఉత్పత్తులతో ఈ విభాగం సానుకూల ఫలితాలను సాధిస్తోంది. కంపెనీ కొత్త థెరప్యూటిక్ కేటగిరీల్లోకి కూడా విస్తరిస్తోంది.













