లవ్ ను ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకునే రోజే వాలెంటైన్స్ డే. టాలీవుడ్ లో ఈ వారం మరింత పండగ వాతావరణం నెలకొంది.
ధనుష్ 3 మూవీ ఫిబ్రవరి 6న రీరిలీజవగా, ఫిబ్రవరి 7న రామ్ చరణ్ ఆరెంజ్ మూవీ రీరిలీజై థియేటర్లలో సందడి చేస్తున్నాయి.
వాటితో పాటూ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ ఫిబ్రవరి 14న రిలీజవుతోంది.
ఉదయ్‌కిరణ్ నటించిన లవ్‌స్టోరీ మనసంతా నువ్వే, నాగచైతన్య, సమంతల ఏ మాయ చేసావే ఫిబ్రవరి 14న రీరిలీజ్ అవుతున్నాయి.
రీరిలీజ్‌లతో పాటూ ఈ వాలైంటెన్ వీక్ లో విశ్వక్‌సేన్ ఫంకీ, సంగీత్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ, అర్జున్ దర్శకత్వంలో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ గా తెరకెక్కిన సీతాపయనం రిలీజవుతున్నాయి.
ఇవి కాకుండా అమరావతికి ఆహ్వానం, స్వీటీ నాటి క్రేజీ, బూకీ, నిలవే, వన్ ప్లస్ వన్ ఆఫర్, స్కై, ఓ రోమియో, తూ యా మై, చథా పచ్చ లాంటి చిన్న సినిమాలు కూడా రిలీజవుతున్నాయి.
వాలెంటైన్స్ డే సందర్భంగా థియేటర్లలో ఈసారి లవ్ సినిమాల ఫుల్ ఫీస్ట్ కనిపించబోతోంది. పాత క్లాసిక్స్ రీరిలీజ్‌లతో పాటు కొత్త ప్రేమకథలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి.
ఈ వారం థియేటర్లలోకి వెళ్లే ప్రతి జంటకు, ప్రేమకథల అభిమానులకు ఇది ఒక ప్రత్యేక అనుభూతి. ప్రేమను సెలబ్రేట్ చేసుకునే ఈ సీజన్‌లో సినిమాల ద్వారా లవ్ ఫీలింగ్ మరింత స్ట్రాంగ్‌గా కనిపించనుంది.