Chikiri Song: చికిరి సాంగ్ హుక్ స్టెప్ చరణ్దేనట
రామ్ చరణ్(ram charan) హీరోగా బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది(peddi). విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్(janhvi kpoor) హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్(Sivaraj kumar), బాలీవుడ్ స్టార్ దివ్యేందు శర్మ(divyendu sharma) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఉప్పెన(Uppena) తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో పెద్దిపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
దానికి తగ్గట్టు పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, చికిరి(chikiri) లిరికల్ కు కూడా ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చికిరి సాంగ్ అయితే రిలీజైన కొద్ది నిమిషాల్లోనే చార్ట్‌బస్టర్ గా నిలిచింది. అంతేకాదు, మిలియన్ల వ్యూస్ తో ఈ సాంగ్ ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లోనే ఉంది. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఆ సాంగ్ లోని హుక్ స్టెప్ ను రీల్స్ చేస్తూ తెగ వైరల్ చేశారు.
అయితే ఈ హుక్ స్టెప్ విషయంలో రీసెంట్ గా ఆ సాంగ్ ను కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్(jani master) ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. చికిరి సాంగ్ లోని హుక్ స్టెప్, బ్యాట్ పట్టుకుని వేసే స్టెప్ ను స్వయంగా చరణే కంపోజ్ చేశాడని, తాను కూర్చుని చేసే స్టెప్ ను కంపోజ్ చేసినట్టు చెప్పడంతో చరణ్ లో ఈ టాలెంట్ కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
https://x.com/Filmyscoopss/status/2022145319153414261?s=20













