Pooja Hegde: టాలీవుడ్ లో కంబ్యాక్ కోసం పూజా ప్రయత్నాలు
టాలీవుడ్లో ఒక దశలో అగ్రస్థానంలో నిలిచిన పూజా హెగ్డే(pooja hegde) ఇప్పుడు కొత్త ప్లాన్ తో రీఎంట్రీకి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస సక్సెస్‌లతో స్టార్ హీరోల సరసన మెరిసిన ఆమె, ఆ తర్వాత వచ్చిన పరాజయాలతో కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. భారీ రెమ్యూనరేషన్ కారణంగా కొన్ని ప్రాజెక్టులు చేజార్చుకుందనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అదే సమయంలో ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి.
ప్రస్తుతం తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూనే ప్రముఖ బ్రాండ్ ఎండార్స్మెంట్లతో బిజీగా ఉన్నప్పటికీ, పూజా దృష్టి మళ్లీ టాలీవుడ్ పై పడిందని సమాచారం. టాలీవుడ్లో తాను సంపాదించిన స్టార్డమ్, అభిమానుల ఆదరణ తనకు ప్రత్యేకమని భావిస్తున్న పూజా, కథల ఎంపికలో ఈసారి మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. పాత్ర ప్రాధాన్యం, కథా బలం లాంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.
కాగా రెండు తెలుగు ప్రాజెక్టుల కోసం మేకర్స్ పూజాని సంప్రదించినట్టు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో కూడా సర్దుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు ఆమె కంబ్యాక్‌పై ఉన్న సీరియస్‌నెస్‌ను సూచిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే పూజా తర్వాతి తెలుగు సినిమా అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి పూజాకి ఇప్పుడైనా తెలుగులో సరైన హిట్స్ దక్కుతాయో లేదో చూడాలి.













