UAEvsCAN: టీ20 ప్రపంచకప్‌లో యూఏఈ బోణీ.. కెనడాపై ఉత్కంఠ విజయం!
టీ20 ప్రపంచకప్ 2026లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ఎట్టకేలకు విజయాల ఖాతా తెరిచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కెనడాతో (UAEvsCAN) జరిగిన పోరులో యూఏఈ 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకుంది. బౌలింగ్‌లో జునైద్ సిద్దిఖీ ఐదు వికెట్లతో చెలరేగగా, బ్యాటింగ్‌లో ఆర్యాంశ్ శర్మ, సోహైబ్ ఖాన్ సమయస్ఫూర్తితో ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్ష్ థాకర్ (50), నవనీత్ ధలివాల్ (34) రాణించినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమవడంతో కెనడా భారీ స్కోరు సాధించలేకపోయింది. ముఖ్యంగా యూఏఈ బౌలర్ జునైద్ సిద్దిఖీ నిప్పులు చెరిగే బంతులతో కెనడా (UAEvsCAN) బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. తన కోటా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి కీలకమైన 5 వికెట్లు పడగొట్టి, టీ20 ప్రపంచకప్‌లో 5 వికెట్లు తీసిన తొలి యూఏఈ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇవి కూడా చదవండి
అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈకి (UAEvsCAN) ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ వసీమ్ (4), అలిషాన్ (5) తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో ఒక దశలో జట్టు కష్టాల్లో పడింది. అయితే ఓపెనర్ ఆర్యాంశ్ శర్మ (74 నాటౌట్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి సోహైబ్ ఖాన్ (51) తోడవ్వడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. వీరిద్దరూ పోటీపడి బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. చివర్లో ఉత్కంఠ నెలకొన్నా, మరో రెండు బంతులు మిగిలి ఉండగానే యూఏఈ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన జునైద్ సిద్దిఖీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇవి కూడా చదవండి













