Nani: వెంకీతో నాని ప్రాజెక్టు?
తొలిప్రేమ(tholi prema) సినిమాతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి(venky atluri) తర్వాత మిస్టర్ మజ్ను(mr. majnu)తో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత సార్(Sir), లక్కీ భాస్కర్ (lucky basckar) సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న వెంకీ అట్లూరి ప్రస్తుతం కోలీవుడ్ హీరో సూర్య(suriya)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మమిత బైజు(mamitha byju) హీరోయిన్ గా నటిస్తోంది.
సూర్య కెరీర్లో 46వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య తర్వాత వెంకీ నేచురల్ స్టార్ నాని(nani) తో సినిమా చేసే అవకాశమున్నట్టుట ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలొస్తున్నాయి. కాగా ప్రస్తుతం నాని ది ప్యారడైజ్(The Paradise) షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ ఇప్పటికే అయిపోవాల్సింది కానీ ఆలస్యమైంది.
ఇవి కూడా చదవండి
అయితే ది ప్యారడైజ్ సినిమాను చేస్తూనే నాని కథలు వింటున్నారని, అందులో భాగంగానే వెంకీ అట్లూరి నానికి ఓ కథ చెప్పాడని, నాని కూడా దానికి సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ సాహో (Saaho) ఫేమ్ సుజిత్(Sujeeth) తో ఓ భారీ యాక్షన్ సినిమాను లైన్ లో పెట్టిన నాని, వెంకీకి కూడా ఓకే చెప్తే ఏ మూవీని ముందుగా చేస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
ఇవి కూడా చదవండి













