Budget: ఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను (Budget) ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు విజయవాడలోని కనకదుర్గమ్మ (Kanakadurgamma)ను దర్శించుకున్నారు. అమ్మవారి పాదాలచెంత బడ్జెట్ ప్రతులను ఉంచి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత అధికారులకు ఆలయ ఈవో శీను నాయక్ (Seenu Nayak)ఘనస్వాగతం పలికారు. బడ్జెట్ ప్రతులకు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం వారికి వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రాభివద్ధిని, ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రూపొందించిన ఈ బడ్జెట్ నిర్విఘ్నంగా అమలు కావాలని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు అమ్మవారిని ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి













