Municipal Elections: ఎక్స్ అఫీషియో ఓటుపై ఎస్ఈసీ స్పష్టత
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల (Municipal elections) ఫలితాలు వెలువడ్డాయి. పలు చోట్ల హంగ్ )Hung) ఏర్పడింది. దీంతో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు( MLAs), ఎమ్మెల్సీలు (MLCs) , ఎంపీ ( MPs)లకు ఎక్స్ అఫీషియో ఓటుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు తమ నియోజకవర్గ పరిధిలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు వేయొచ్చు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు తమకు ఓటు ఉన్న మున్సిపాలిటీలోనే ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకోవచ్చు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఎక్సఅఫీషియో ఓటు నమోదుకు నేటి వరకు ఎసఈసీ అవకాశం ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
మీ రాశి ప్రకారం లక్కి కలర్స్ నంబర్లు ఇవే..
సాఫ్ట్వేర్ జాబ్ వదిలేశాడు.. ఆటో పట్టాడు.
ప్రేమలో ఇచ్చే 7 అందమైన వాగ్దానాలు













