Team India: టెస్ట్ క్రికెట్ కు మరో సీనియర్ గుడ్ బై..!
భారత క్రికెట్ లో రిటైర్మెంట్ల పర్వం కొనసాగే సంకేతాలు కనపడుతున్నాయి. గత ఏడాది నుంచి పలువురు ఆటగాళ్లు రిటైర్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మరో ఆటగాడు కూడా రిటైర్డ్ అయ్యే సంకేతాలు ఉన్నాయని జాతీయ మీడియా అంటోంది. గత కొన్ని రోజులుగా స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజ(Ravindra Jadeja) ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీమిండియా యాజమాన్యం నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉన్నప్పటికీ జడేజా మాత్రం రాణించడం లేదు. టెస్ట్ క్రికెట్ తో పాటుగా వన్డేలకు మాత్రమే పరిమితమైన జడేజా.. ఆల్ రౌండర్ హోదాలో జట్టులో ఉంటున్నప్పటికీ కీలకమైన సమయంలో కూడా ఆదుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా బౌలింగ్ లో పదేపదే అతను విఫలం కావడంపై కూడా విమర్శలు ఉన్నాయి. బ్యాటింగ్లో కొంత పరవాలేదు అనిపిస్తున్నప్పటికీ వన్డే క్రికెట్లో మాత్రం అతను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ తో పాటుగా ఆ తర్వాత జరిగిన సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తో సిరీస్లో అతను ఏమాత్రం రాణించలేదు. దీంతో జడేజా తప్పుకోవాలనే ఒత్తిడి బోర్డు నుంచి వస్తుందని కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే త్వరలోనే టెస్ట్ క్రికెట్ నుంచి అతను తప్పుకోవచ్చని జాతీయ మీడియా వర్గాలు అంటున్నాయి. 2027 ప్రపంచకప్(World Cup) వరకు వన్డేలు మాత్రమే ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రపంచ కప్ పై దృష్టి పెట్టి టెస్ట్ క్రికెట్ కు చెప్పాలని జడేజా భావిస్తున్నాడు.
త్వరలోనే దీనిపై ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని సమాచారం. భారత్ ఏడాది ఆస్ట్రేలియా తో పాటుగా వచ్చే ఏడాది ఇంగ్లాండ్ తో కూడా టెస్ట్ సిరీస్ ఆడనుంది. న్యూజిలాండ్ తో పాటుగా సౌతాఫ్రికా వంటి బలమైన జట్లతో టెస్టులు ఉన్నాయి. అందుకే జట్టు నీ బలోపేతం చేయాలి అంటే కచ్చితంగా అతను తప్పుకోవాలని యాజమాన్యం కోరుతున్నట్లు సమాచారం. జడేజ స్థానంలో మరో ఆల్రౌండర్ ను జట్టులోకి తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ తర్వాత అతనిపై విమర్శలు గట్టిగానే వచ్చాయి. ఫీల్డింగ్ పరంగా కూడా జడేజా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ వేసవిలో అతను దాదాపుగా టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి













