Chandrababu: మారకపోతే మీ ఇష్టం.. ఎమ్మెల్యేలకు సిఎం వార్నింగ్..!
ఏపీ బడ్జెట్(Budget 2026-27) పై సిఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని, ఇబ్బందులు అధిగమించిన ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలు అయితే మాత్రం ఇంకా చాలా ఉన్నాయి.. ఆదాయం తక్కువ – ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చిందన్నారు. కేంద్రం సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం.. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని ఆకాంక్షించారు.
సేవా రంగంలోనూ ఆదాయం మరింత పెరగాలి.. ఒంగోలు పాలకు, అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉందని తెలిపారు. ఈ రెండింటి రుచి మరెక్కడా రాదు.. రెండు మూడేళ్లలో మరింత మెరుగైన బడ్జెట్(Budget Session) ప్రవేశపెడతామన్నారు. అప్పటికి పూర్తిగా గాడిలో పడతాం.. రెండు మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని పేర్కొన్నారు. అమరావతి రోడ్లను జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని పేర్కొన్నారు. ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్ వల్ల యాక్సిస్ మరింత పెరుగుతుందన్నారు సిఎం.
ఇవి కూడా చదవండి
రాయలసీమ ముఖచిత్రం మార్చింది మేమే.. హార్టికల్చర్ హబ్ కు రూ. 30 వేల కోట్లు కేటాయించడం బాగుందని తెలిపారు. రాయలసీమలో ఒకప్పుడు పశువులకు నీరు కూడా దొరికేది కాదన్న ఆయన.. పశుగ్రాసం, నీళ్లను రైళ్లలో తరలించిన సందర్భాలు ఉన్నాయన్నారు. 2014 – 19 మధ్య కూడా రైన్ గన్స్ తో పంటలు కాపాడే పరిస్థితి ఉండేది..అప్పుడే హంద్రీనీవాను సీరియస్గా తీసుకున్నామని, దేశంలోనే నాణ్యమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయి.. రాయలసీమలో పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చే నివేదిక వారి పని తీరుకు నిలువుటద్దమని తెలిపారు. నేను గతంలో ఉన్నట్లే నిక్కచ్చిగానే ఉంటా.. మారకపోతే వాళ్లకే నష్టమని హెచ్చరించారు. మొత్తం తొమ్మిది పేరా మీటర్లలో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నానని.. వారికి తెలియని ఇంకొన్ని పేరా మీటర్లు కూడా నావద్ద ఉన్నాయన్నారు. లోకేష్ తన పని తాను చేస్తున్నాడు.. నా పని నేను చేస్తున్నా అని.. నేతలతో మానవీయ సంబంధం, మోటివేషన్ భయం – భక్తిలా ఉండాలంటూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి













