Nagabandham: మహేష్ బాబు లాంచ్ చేసిన ‘నాగబంధం’ స్పెల్‌బైండింగ్ ఎపిక్ టీజర్
విరాట్ కర్ణ హీరోగా దర్శకుడు అభిషేక్ నామా రూపొందిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మైథో-యాక్షన్ స్పెక్టకిల్ ‘నాగబంధం’ టీజర్ పవిత్ర మహా శివరాత్రి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, రిచ్ ప్రొడక్షన్ విల్యూస్తో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఫ్రేమ్‌లోనూ వారి గ్రాండ్ విజన్‌ను ప్రజెంట్ చేస్తోంది. ఆధ్యాత్మికతను అద్భుతమైన విజువల్ అంబిషన్‌తో కలిపి ఒక గొప్ప సినీ అనుభూతిని అందించేలా టీజర్ మెస్మరైజ్ చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు టీజర్‌ను లాంచ్ చేయడంతో దేశవ్యాప్తంగా అంచనాలు మరింత పెరిగాయి. ఆయన తన ఎక్స్ అకౌంట్ లో “ #WorldOfNagabandham అద్భుతంగా వుంది. త్వరలో ఎక్స్ పీరియన్స్ చేయాలని ఎదురు చూస్తున్నాను.. 🤗🤗🤗” అని ట్వీట్ చేశారు.
హిమాలయాల మిస్టిక్ నేపథ్యంతో ప్రారంభమయ్యే ఈ టీజర్, కాలానికంటే పురాతనమైన ఒక రహస్య ప్రపంచానికి ప్రేక్షకులను తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి లోభం ఆ దైవిక సత్యాన్ని వెలుగులోకి తేవడానికి ప్రయత్నించగా, విధి తన యోధుడిని ఎంచుకునే కథగా ఇది అద్భుతంగా ముందుకు సాగుతుంది.
అహ్మద్ షా అబ్దాలి నేతృత్వంలో జరిగిన ఆఫ్ఘాన్ దాడి నుండి కొంత ప్రేరణ పొందిన ఈ కథలో మైథాలజీ, చరిత్ర, ఆధ్యాత్మిక యుద్ధం మేళవింపుగా కనిపిస్తుంది. సంస్కృతి పరిరక్షణ, దైవిక రక్షణ మధ్య సంఘర్షణ ఈ చిత్రానికి ప్రధాన బలం.
పవిత్ర ‘నాగబంధం దేవాలయం’ ఈ ఎపిక్ కథలో కీలక పాత్ర పోషిస్తుంది. హిమాలయాల రహస్య మార్గాల్లో దాగి ఉన్న ఈ దేవాలయం ఒక విశ్వశక్తిని కాపాడుతుందని నమ్మకం. అది చెడ్డవారి చేతుల్లో పడితే అణచలేని విధ్వంసం సంభవించే ప్రమాదం ఉందని కథ సూచిస్తుంది.
“బ్రహ్మ సృష్టి నుంచి పుట్టింది…విష్ణు ధర్మం కాపాడుతోంది… మహాదేవుడి ఆగ్రహం శక్తినిస్తుంది…” అనే లైన్ ఈ చిత్ర సోల్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. దేవత్వం, విధి, విధ్వంసం కలిసే మహాకావ్యంగా ‘నాగబంధం’ నిలుస్తుందనే సంకేతాలు టీజర్ ఇస్తోంది.
దర్శకుడు అభిషేక్ నామా గ్రాండ్ విజన్‌తో మైథాలజీ, యాక్షన్, ఆధ్యాత్మికతను అద్భుతంగా మేళవించారు. టీజర్ లో డైలాగ్ లేకపోయినా విజువల్స్‌తోనే ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ ఎస్ హిమాలయాల అందాలను అద్భుతంగా చూపించగా, హైఎండ్ వీఎఫ్ఎక్స్ చిత్రాన్ని మరింత గ్రాండ్‌గా నిలబెట్టాయి.
ఆశోక్ కుమార్ రూపొందించిన ప్రొడక్షన్ డిజైన్, జునైద్ కుమార్ అందించిన గూస్బంప్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆర్సీ ప్రణవ్ చేసిన ఎడిటింగ్ అన్ని కలిసి ప్రేక్షకులను నాగబంధం ప్రపంచంలో లీనమయ్యేలా చేశాయి. నిర్మాతలు ఎలాంటి రాజీ పడకుండా భారీ సెట్లు, టెక్నికల్ ఎక్సలెన్స్‌తో చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు.
విరాట్ కర్ణ ఈ చిత్రంలో పవర్ఫుల్ అవతార్‌లో కనిపిస్తూ టీజర్లో హైలైట్‌గా నిలిచారు. ముఖ్యంగా లార్డ్ శివ రూపంలో ఆయన ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. మొసలితో చేసే ఫైట్ సీన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లార్డ్ శివ పాత్రను పోషించడం సులభం కాదు, కానీ విరాట్ కర్ణ తన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేశారని టీజర్ సూచిస్తోంది.
నభా నటేష్, ఐశ్వర్య మీనన్, మహేష్ మంజ్రేకర్, జగపతి బాబు, రిషబ్ సావ్నీ, గరుడ రామ్, జయప్రకాశ్, మురళీ శర్మ, అనసూయ భారద్వాజ్, బీఎస్ అవినాష్ కీలక పాత్రల్లో కనిపించారు.
టీజర్ విడుదలతోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనతో ‘నాగబంధం’ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ప్రసాద్ PCX హైదరాబాద్‌లో జరిగిన టీజర్ స్పెషల్ స్క్రీనింగ్ మీడియా ప్రతినిధులు స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ అభినందించారు.
ఈ సమ్మర్లో ధర్మం యుద్ధాన్ని, మహా సంగ్రామాన్ని ‘నాగబంధం’ రూపంలో చూసేందుకు గెట్ రెడీ.













