Nara Lokesh: ‘ఐ యామ్ సారీ వాలీ. త్వరలో కలుద్దాం’.. కోవా బన్ వ్యక్తికి అండగా నారా లోకేష్..
Nara Lokesh: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కోవా బన్ అంశంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా బాధితుడికి ఆయన క్షమాపణ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మతపరమైన ప్రవర్తనకు చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. “మీరు ఎదుర్కొన్న ఈ పరిస్థితికి క్షమాపణలు చెబుతున్నాను. ఎల్లప్పుడూ సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం కోసం నిలబడే మన తెలుగు సమాజంలో ఇలాంటి విభజన, మతపరమైన ప్రవర్తనకు అస్సలు చోటు లేదు. ఈ అంశంపై నేను మీ వెన్నంటే ఉంటా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. మీ కోవా బన్ని టేస్ట్ చేస్తా” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కోవా బన్ వ్యాపారికి తెలుగు రాష్ట్రాల్లో వెల్లువలా మద్దతు లభిస్తోంది.
అసలేమైంది…
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఓ సాధారణ వ్యాపారి అయిన ‘వాలి’ వద్దకు వెళ్ళిన కొందరు వ్యక్తులు, అతని మతాన్ని ఉద్దేశించి దూషిస్తూ, అతని వద్ద ఎవరూ వస్తువులు కొనవద్దని ప్రచారం చేశారు. దీనిపై కొందరు నెటిజన్ల నుంచి వ్యతిరేకత వచ్చింది.













