MS Dhoni: ధోనీని కెప్టెన్‌గా తప్పుకోమన్నాం.. మాజీ సెలెక్టర్ షాకింగ్ కామెంట్స్
టీమిండియా విజయవంతమైన కెప్టెన్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు ఎంఎస్ ధోనీ (MS Dhoni). అయితే 2017లో ధోనీ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుని విరాట్ కోహ్లీకి పగ్గాలు అప్పగించడం అప్పట్లో పెను సంచలనం. అది ధోనీ స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం కాదని, అప్పటి బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సూచన మేరకే ఆయన సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడనే ఆసక్తికరమైన విషయాన్ని మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపే బయటపెట్టారు.
ఓ ఇంటర్వ్యూలో పరాంజపే మాట్లాడుతూ.. అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో కలిసి తాము ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ ప్రాక్టీస్ ముగించుకుని రాగానే, ఎమ్మెస్కే ఎంతో గౌరవప్రదంగా ఆ విషయాన్ని ధోనీకి తెలియజేశారని చెప్పారు. “కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం” అని చెప్పగానే.. మాహీ ఏమాత్రం ఆలోచించకుండా “అన్నా.. ఇది సరైన నిర్ణయమే. నా నుంచి మీకేం కావాలి?” అని అడిగాడట. సారథ్యం నుంచి తప్పుకుంటున్నట్లు మెయిల్ చేయాలని అడగ్గా, ఆ రోజు రాత్రికే ధోనీ (MS Dhoni) నుంచి రాజీనామా మెయిల్ వచ్చిందని పరాంజపే గుర్తుచేసుకున్నారు.
ఆ నిర్ణయం తర్వాత తమపై తీవ్ర విమర్శలు వచ్చినా, జట్టు భవిష్యత్తు కోసం ఆ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు. అయితే కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లీకి తాను పూర్తి అండగా ఉంటానని, అతను తనకు సోదరుడి లాంటివాడని ధోనీ (MS Dhoni) మాటిచ్చాడట. తన అనుభవాన్నంతా రంగరించి విరాట్‌తో కలిసి మంచి జట్టును నిర్మిద్దామని ధోనీ చెప్పిన తీరును ఆయన కొనియాడారు. కాగా, భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు (2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ) అందించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన ధోనీ(MS Dhoni).. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.













