Ganasudha: టాంటెక్స్ ‘గానసుధ’ రేడియోలో మల్లికార్జున జ్యోతిర్లింగ దివ్య వైభవం
TANTEX: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) గర్వంగా సమర్పిస్తున్న ‘గానసుధ – మన టాంటెక్స్ రేడియో’ కార్యక్రమంలో ఈ వారం ఒక విశిష్ట ఆధ్యాత్మిక అంశాన్ని ప్రసారం చేయనున్నారు. “మన ద్వాదశ జ్యోతిర్లింగాల విశిష్టతను వివరించే కార్యక్రమంలో భాగంగా, ఈ ఆదివారం రెండో భాగంలో మల్లికార్జున జ్యోతిర్లింగ దివ్య వైభవాన్ని,శివ-శక్తుల శక్తివంతమైన రూపాన్ని మనకు పరిచయం చేయనున్నారు.”
- తేదీ: ఫిబ్రవరి 15, 2026, ఆదివారం.
- సమయం: సాయంత్రం 5:00 నుండి 6:00 వరకు (CST).
- వేదిక: రేడియో ఆజాద్ (Radio Azad).
- నిర్వహణ (RJ): పరిమళ మార్పాక.
శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినడానికి www.radioazad.us యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా (972) 501-9390 నంబర్‌కు సంప్రదించవచ్చు.
సంప్రదించవలసిన వారు:
మరిన్ని వివరాల కోసం రేడియో కమిటీ చైర్ ఉదయ్ నిడిగంటి (Uday Nidiganti) గారిని (631) 384-0524 నంబర్లో సంప్రదించగలరు.
స్పాన్సర్స్:
ఈ కార్యక్రమానికి రాజేష్ కల్లెపల్లి, లక్కీ చార్మ్స్, డాక్టర్ ప్రేమ్ రెడ్డి, దేశీ మండి, బావర్చీ ఇండియన్ కుజీన్ వంటి పలువురు ప్రముఖులు, సంస్థలు ప్రాయోజకులుగా వ్యవహరిస్తున్నారు.













