Chandrababu: సీఎం చంద్రబాబుతో బిల్‌గేట్స్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్‌గేట్స్ (Bill Gates) భేటీ అయ్యారు. గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన అనంతరం ఆయన నేరుగా అమరావతి (Amaravati)లోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. బిల్‌గేట్స్‌కు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ (Deputy CM Pawan), మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో బిల్‌గేట్స్ బందం సమావేశమైంది. ఆ తర్వాత సచివాలయంలో రియల్ టైమ్స్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని బిల్‌గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ విధానాలు, సాధిస్తున్న ఫలితాల్ని గేట్స్‌కు చంద్రబాబు వివరించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై బిల్‌గేట్స్‌తో చంద్రబాబు చర్చించనున్నారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి వివరించనున్నారు.













