Bangladesh: పీఎం మోడీ స్థానంలో తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి స్పీకర్ ఓం బిర్లా
బంగ్లాదేశ్ (Bangladesh) రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అధికార పీఠాన్ని అధిష్టించేందుకు సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా ఈ నెల 17వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటే కొత్త మంత్రివర్గం కూడా అదే రోజున కొలువుదీరనుంది. ఈ అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ (Bangladesh) మధ్యంతర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.
అయితే అదే సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని మోదీ కీలకమైన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ షెడ్యూల్ కారణంగా బంగ్లాదేశ్ పర్యటనకు మోదీ వెళ్లలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి
ఈ నేపథ్యంలో బంగ్లా ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవంలో భారతదేశం తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రాతినిధ్యం వహిస్తారని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తారిఖ్ రెహ్మాన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు బంగ్లాదేశ్ (Bangladesh) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పొరుగు దేశాలతో పాటు పలు కీలక దేశాలకు కూడా ఆహ్వానాలు పంపింది.
ఈ వేడుకలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం పాల్గొంటారని సమాచారం. భారత్, చైనాలతో పాటు సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఖతార్, మలేసియా, బ్రూనై, శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ తదితర దేశాల ప్రభుత్వాలకు బంగ్లాదేశ్ (Bangladesh) ఆహ్వానాలు పంపినట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుతో బంగ్లాదేశ్‌లో మళ్లీ స్థిరమైన పరిపాలన గాడిలో పడుతుందని, ఈ అంతర్జాతీయ నేతల రాకతో ఆ దేశ దౌత్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి













