UBS: పవన్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్న ఉస్తాద్ భగత్ సింగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) నటిస్తున్న భారీ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad bhagath singh) నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో పాటపై మేకర్స్ అధికారిక అప్డేట్ ఇచ్చారు. “ఆరా ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్” పేరుతో రాబోతున్న ఈ సాంగ్‌ను ఫిబ్రవరి 22న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. విడుదల చేసిన మ్యాడ్ పోస్టర్లో పవన్ కళ్యాణ్ తన ఐకానిక్ మెడపై చేయి వేసే మ్యానరిజాన్ని ప్రదర్శించగా, బ్యాక్‌గ్రౌండ్‌లో పలువురు ఆర్టిస్టులు అదే స్టైల్‌ను ఫాలో అవుతూ కనిపించడంతో ఫ్యాన్స్ పిచ్చోళ్లైపోతున్నారు. పోస్టర్ నుంచే ఈ పాట ఫ్యాన్స్‌కు ప్రత్యేక ట్రీట్‌గా ఉండబోతుందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
డైరెక్టర్ హరీష్ శంకర్(harish shankar) మరోసారి పవన్ ఫ్యాన్స్ నాడిని అందిపుచ్చుకునేలా సాంగ్‌ను డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పవన్‌కు జోడీగా శ్రీలీల(sree leela), రాశీ ఖన్నా(raashi khanna) కూడా నటిస్తుండటంతో గ్లామర్ యాంగిల్ కూడా బాగా స్ట్రాంగ్ అయింది. ముఖ్యంగా ఆరా అనే పదం ద్వారా పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ను సెలబ్రేట్ చేసే థీమ్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాకే మెయిన్ హైలైట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్(devi sri prasad) ఈ సాంగ్ ను ఏ స్థాయిలో కంపోజ్ చేశారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మాస్ బీట్లలో తనదైన ముద్ర వేసిన దేవిశ్రీ, పవన్ ఎనర్జీకి తగ్గట్టుగా పవర్ఫుల్ ట్రాక్ అందించనున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. సాంగ్ రిలీజ్‌తో సినిమా ప్రమోషన్స్ మరింత వేగం అందుకునే అవకాశముంది.













