Congress: రామగుండంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం?
రామగుండం కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ (Congress) పార్టీ కసరత్తును ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించి, తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తం 38 డివిజన్లలో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్‌ను దాటడమే కాకుండా, ఇతర పార్టీల నుంచి కూడా చేరికలు ఉండటంతో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. బీఆర్ఎస్ నుంచి ఒకరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఐదుగురు అభ్యర్థులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం పార్టీ సంఖ్యాబలం 44కు చేరుకుంది.
రామగుండం మేయర్ స్థానం ఎస్సీ జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో ఈ పదవి కోసం పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపికపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో గెలిచిన కార్పొరేటర్లను కాంగ్రెస్ (Congress) నాయకత్వం ఇప్పటికే హైదరాబాద్‌లోని క్యాంపునకు తరలించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాతే తుది పేర్లను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ఐక్యంగా ఉన్నప్పటికీ, మేయర్ కుర్చీ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ (Congress) క్యాంపులో ఉన్న సభ్యులంతా ఈ నెల 16న నేరుగా ఎన్నికల ప్రక్రియకు హాజరుకానున్నారు. అప్పటి వరకు అధిష్టానం ఎవరి పేరును ప్రకటిస్తుందోనన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే సోమవారం మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి













