ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి! ఫిబ్రవరి 16-22: హిట్ టార్గెట్ చిత్రాలు-పై దృష్టి
ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి! ఫిబ్రవరి 16-22 హిట్ టార్గెట్ చిత్రాలు-పై దృష్టి ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్య విడుదలయ్యే చిత్రాల్లో యంగ్ హీరోలు సుహాస్, శివ కందుకూరి నటించిన సినిమాలకు పెద్దగా కాంపిటీషన్ లేకపోవడం విశేషం. ఫిబ్రవరి 20న ఎక్కువ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఫన్ ఎంటర్టైనర్గా సుహాస్ హే భగవాన్
హే భగవాన్ సినిమాలో సుహాస్ హీరోగా నటించగా, శివానీ నాగరం హీరోయిన్ గా కనిపించనున్నారు. సీనియర్ నటుడు నరేష్, హర్షవర్ధన్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బి. నరేంద్ర రెడ్డి నిర్మించారు. ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా కనిపిస్తోంది. ఫిబ్రవరి 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి
నవాబ్ కేఫ్ – తండ్రీ కొడుకుల కథ
శివ కందుకూరి ప్రధాన పాత్రలో నటించిన సినిమా నవాబ్ కేఫ్. రాజీవ్ కనకాల కీలక పాత్ర పోషించారు. ఛాయ్ వాలా పేరుతో ప్రారంభమైన ఈ సినిమా, సెన్సార్ కారణాలతో టైటిల్ మార్చుకుంది. ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగ సంఘర్షణ ప్రధానాంశంగా ఉంటుంది. కుటుంబ కేఫ్‌ను అమ్మాలనుకునే కొడుకు, దాన్ని కాపాడాలనుకునే తండ్రి మధ్య జరిగే పరిణామాలు కథలో ప్రధానంగా నిలుస్తాయి. ఫిబ్రవరి 20న ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి
ఆల్ఫా – యాక్షన్ డ్రామా
ఆల్ఫా మూవీలో హేమంత్ కుమార్ హీరోగా నటించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. అయానా, గోపిక సురేష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 20న ఆల్ఫా ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్రిశంకు – ఫ్యామిలీ ఎంటర్టైనర్
త్రిశంకు సినిమాలో అమన్, ప్రాచీ తెహ్లాన్ జంటగా నటించారు. యాంకర్ రష్మీ గౌతమ్, సీనియర్ నటుడు సుమన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 20న విడుదలకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి
మొత్తంగా ఈ వారం చిన్న, మధ్యస్థాయి సినిమాలే థియేటర్లలో ఎక్కువగా కనిపించనున్నాయి. పెద్ద సినిమాల హడావిడి లేకపోవడంతో ఈ సినిమాలకు మంచి స్క్రీన్ కౌంట్ లభించే అవకాశం ఉంది. మరి ఈ వారం సినిమాల్లో ఏది ఆడియన్స్ ను మెప్పిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి













