Bill Gates: ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్
ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించిన బిల్ గేట్స్
రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
• డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్న బిల్ గేట్స్.
• ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజంటేషన్లను పరిశీలించిన బిల్ గేట్స్.
• డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని వివరించిన సీఎం చంద్రబాబు.
• డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్న గేట్స్.
• అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమారాచాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్‌కు తెలిపిన సీఎం.
• ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును పరిశీలించిన గేట్స్.
• కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు తెలిపిన ముఖ్యమంత్రి.
• ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన బిల్ గేట్స్.
• బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని… అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపిన అధికారులు.
• ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ , జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని తెలిపిన సీఎం చంద్రబాబు.
• తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును అడిగి తెలుసుకున్న బిల్ గేట్స్.
• బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని తెలుకున్న గేట్స్.
• కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ వ్యాఖ్యానించిన బిల్ గేట్స్.
• ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని తెలిపిన అధికారులు.
• ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేలా చూస్తున్నామని తెలిపిన సీఎం చంద్రబాబు… గ్రేట్ అంటూ కితాబిచ్చిన బిల్ గేట్స్.
• బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను అడిగి తెలుసుకున్న బిల్ గేట్స్.
• డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందన్న గేట్స్.
• ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్న బిల్ గేట్స్.
• రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్య.
• రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్‌కు వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు…గ్రేట్ వర్క్ అంటూ కితాబిచ్చిన గేట్స్.













