Karimnagar: కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీదే
కరీంనగర్ (Karimnagar) కార్పొరేషన్ బీజేపీ (BJP) దక్కించుకుంది. మేయర్‌గా ఆ పార్టీకి చెందిన కొలగాని శ్రీనివాస్ (Srinivas) ఎన్నికయ్యారు. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో కరీంనగర్ మేయర్ పీఠాన్ని కమలదళం కైవసం చేసుకుంది. ఈ మేరకు ఎన్నికల అధికారి ప్రకటించారు. మేయర్ (Mayor) పీఠాన్ని దక్కించుకోవడం కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాంగ్రెస్, బీఆరఎస్, ఎంఐఎం ఆలఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ( ఏఐఎఫ్బీ) సభ్యులు, స్వతంత్రులు కలిసి ఎలాగైనా కార్పొరేషన్‌ను తమకు అనుకూలంగా మలచుకోవాలనే విధంగా చక్రం తిప్పారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగర శివారులోని ఓ రిసార్టులో వేర్వేరుగా మధ్య సంఖ్యాపరంగా దోబూచులాట కొనసాగింది. చివరికి మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ ఎన్నికలో బీఆరఎస్ తటస్థంగా వ్యవహరించింది.

ఇవి కూడా చదవండి













