Bill Gates: సీఎం, మంత్రులు, సెక్రటరీలతో పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్న బిల్ గేట్స్
• చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని సమావేశంలో సరదాగా వ్యాఖ్యానించిన బిల్ గేట్స్
• భారతదేశంలో ఇన్నోవేషన్స్, వేగవంతమైన నిర్ణయాలు, చర్యలు అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డ బిల్ గేట్స్
• డిజిటల్ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు పడ్డాయన్న బిల్ గేట్స్
• భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చిన బిల్ గేట్స్
• తాను మొదటిసారి సీఎం చంద్రబాబును కలిసినప్పటి విషయాలను సమావేశంలో పంచుకున్న బిల్ గేట్స్
• ప్రపంచ దేశాల్లో తాను కలిసిన ఎంతో మంది నాయకుల ఆలోచనల కంటే చంద్రబాబు ఆలోచనలు చాలా ముందున్నాయని తొలి భేటీలోనే గ్రహించినట్టు వెల్లడించిన గేట్స్
• నాటి సింగపూర్ ప్రధాని కూడా చంద్రబాబు తరహా భిన్నమైన, విజన్‌తో కూడిన ఆలోచనలు చేసేవారని సమావేశంలో వివరించిన బిల్ గేట్స్
• గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులని వివరించిన గేట్స్
• ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న బిల్ గేట్స్
• కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని సమావేశంలో మరోసారి కితాబిచ్చిన బిల్ గేట్స్
• విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి… వారికి సరైన రీతిలో… తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి AI సహయపడుతుందని వివరించిన బిల్ గేట్స్
• విద్యారంగంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పిన బిల్ గేట్స్
• వ్యవసాయం రంగ చాలా ముఖ్యమైన రంగమని అభిప్రాయపడ్డ బిల్ గేట్స్… ఈ రంగం ఎంత ముఖ్యమో ఇప్పటికీ చాలా మందికి తెలియదని వ్యాఖ్యానించిన బిల్ గేట్స్
• టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన బిల్ గేట్స్
• టెక్నాలజీని రైతులకు అందించేందుకు… ఏఐను వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేసేందుకు ఏపీ కృషి చేస్తోందని చెప్పిన బిల్ గేట్స్
• అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో AI టెక్నాలజీని వినియోగంచడం లేదని… కానీ ఆంధ్రప్రదేశ్ దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుండం మంచి పరిణామమని వెల్లడించిన గేట్స్

• డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం టెక్నాలజీతో ముందస్తు అంచనాలతో ప్రాణ నష్టం జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు కావడం బాగుందన్న బిల్ గేట్స్
• డిజిటల్ గవర్నెన్స్ అనే ఆలోచనను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడానికి తాను ప్రయత్నిస్తున్న సమయంలో సీఎం చంద్రబాబు దాని గురించి ఆలోచన చేయడమే కాకుండా… అమలు చేశారన్న బిల్ గేట్స్
• డ్రోన్లతో వివిధ రకాల సేవలు వినియోగించుకునే ఆలోచన అద్భుతంగా ఉందన్న బిల్ గేట్స్
• మలేరియా, అనీమియా జబ్బుల నివారణ కోసం అందరం కలిసి పని చేయాలని బిల్ గేట్స్ సూచన
• సమావేశంలో గేట్స్ ను పలు అంశాలపై ప్రశ్నలు వేసి అభిప్రాయాలు కోరిన మంత్రులు పయ్యావుల, సత్యకుమార్ యాదవ్
• హైదరాబాద్‌లో మైక్రో సాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు కారణమేంటని ప్రశ్నించిన పయ్యావుల… దీనికి ఆసక్తికర సమాధానం చెప్పిన బిల్ గేట్స్
• నాడు చంద్రబాబు ఐటీని ప్రమోట్ చేయడం వల్ల టెక్ నిపుణులు చాలా మంది హైదరాబాద్ నుంచే వచ్చేవారని చెప్పిన బిల్ గేట్స్.
• అదే సమయంలో చంద్రబాబు మైక్రో సాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో పెట్టాలనే ప్రతిపాదన పెట్టారని చెప్పిన బిల్ గేట్స్
• దీనిపై తమ వద్ద పని చేసే వారి అభిప్రాయం కోరితే… హైదరాబాద్ సెంటర్ ఏర్పాటు చేస్తే తాము వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పారని వివరించిన బిల్ గేట్స్
• ఇప్పుడు కూడా భారతదేశంలో మైక్రో సాఫ్ట్ కంపెనీల్లో పని చేసే చాలా మంది ఉద్యోగుల్లో హైదరాబాద్ వారే ఎక్కువగా ఉన్నారని వివరించిన బిల్ గేట్స్













