సంయుక్త మీనన్ గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ లో రానాకు భార్య గా నటిస్తూ టాలీవుడ్ కు పరిచయమైన సంయుక్త మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సొంతం చేసుకున్న సంయుక్త విరూపాక్షతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది.
బింబిసార, సార్ లాంటి పలు సినిమాలతో హిట్లను అందుకున్న సంయుక్త టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
రీసెంట్ గా అఖండ2, నారీ నారీ నడుమ మురారిలో కనిపించిన సంయుక్త త్వరలో స్వయంభు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
స్వయంభులో యోధురాలి పాత్రలో కనిపించనున్న సంయుక్త, ఈ చిత్ర టీజర్ లాంచ్ కోసం చేసిన స్పెషల్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సంయుక్త మీనన్ స్వయంభు సినిమాలో పవర్‌ఫుల్ యోధురాలి పాత్రలో కనిపించనుంది. ఈ రోల్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం
స్వయంభు మూవీ టీజర్ లాంచ్‌కు ముందు సంయుక్త చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెరిగాయి
హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా నిలిచిన సంయుక్త, స్వయంభుతో మరో సూపర్ హిట్ సాధిస్తుందా?