తానా ప్రపంచ సాహిత్య వేదిక: అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు విజయం!
TANA: తానా ప్రపంచ సాహిత్య వేదిక అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) సందర్భంగా, ఉత్తర అమెరికా తెలుగు సంఘము (TANA) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 89వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 22, 2026 ఆదివారం నాడు “మన తెలుగు భాషను ప్రేమిద్దాం, పరిరక్షిద్దాం, పరివ్యాప్తి చేద్దాం” అనే నినాదంతో ఈ కార్యక్రమం జరగనుంది.
కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు:
- ముఖ్య అతిథి: పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. నోరి దత్తాత్రేయుడు (ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు, న్యూయార్క్).
- విశిష్ట అతిథి: డా. జి. సతీష్ రెడ్డి (భారతదేశ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) పూర్వ ఛైర్మన్).
- గౌరవ అతిథి: గౌరవనీయ ఆర్యన్ ఉదయ్ అరేటి (డిప్యూటీ మేయర్, రాయల్ బరో ఆఫ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సియా, లండన్).
ఇవి కూడా చదవండి
ప్రముఖ వక్తలు (విద్యావేత్తలు):
- ఆచార్య డా. వెలుదండ నిత్యానందరావు (ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్).
- ఆచార్య డా. డి. మునిరత్నం నాయుడు (ఉపకులపతి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి).
- ఆచార్య డా. అఫ్సర్ (తెలుగు అధ్యాపకులు, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, అమెరికా).
- ఆచార్య ఉమా ఆత్తోట (తెలుగు అధ్యాపకురాలు, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్, సీయాటెల్, అమెరికా).
- ఆచార్య డా. భారతి శంకరరాజు (తెలుగు అధ్యాపకురాలు, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, అమెరికా).
ఇవి కూడా చదవండి
నిర్వాహక బృందం:
- డా. నరేన్ కొడాలి: అధ్యక్షులు, తానా.
- చిగురుముళ్ల శ్రీనివాస్: సమన్వయకర్త, తానా ప్రపంచ సాహిత్య వేదిక.
- డా. ప్రసాద్ తోటకూర: నిర్వాహకులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక.
ఈ కార్యక్రమం యూట్యూబ్, యుప్పీ టీవీ (YuppTV), టోరీ (Tore) ఛానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.













