Couple Friendly: A సర్టిఫికేట్‌తో సగం రెవెన్యూ లాస్
సంతోష్ శోభన్(santhosh sobhan), మానస వారణాసి(manasa varanasi) జంటగా నటించిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ(Couple friendly). అశ్విన్ చంద్రశేఖర్(Ashwin Chandrasekhar) దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్(UV Concepts) నిర్మించగా, ఫిబ్రవరి 14న ఈ మూవీ రిలీజైంది. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన కపుల్ ఫ్రెండ్లీ(Couple Friendly) పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకు డే1 1.89 కోట్ల గ్రాస్ రాగా, మూవీ యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా ధీరజ్ మొగిలినేని(Dheeraj Mogilineni) మాట్లాడుతూ, రిలీజ్ ముందు ఈ మూవీ ఆడియన్స్ కు గుర్తుండిపోయే లవ్ స్టోరీ అని చెప్పానని, ఆ మాటను నిజం చేస్తూ ఆడియన్స్ మంచి సక్సెస్ ను ఇచ్చారని, ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ అశ్విన్‌కే ఇవ్వాలని, అశ్విన్ ఎంతో హానెస్ట్ గా ఈ మూవీని తీశాడని చెప్పారు. త్వరలోనే సంతోష్, మానసతో ప్రమోషనల్ టూర్ ను ప్లాన్ చేస్తున్నట్టు ధీరజ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి

అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. టైటిల్ కారణంగానే ఆ సర్టిఫికేట్ వచ్చిందని, ఫ్రెండ్లీ కపుల్ అని పెడితే U/A వచ్చేదని చెప్పారు. ఏ సర్టిఫికేట్ కారణంగా పెద్దలు మాత్రమే థియేటర్లో ఈ మూవీ చూడాల్సి ఉంటుంది. దీని వల్ల మూవీకి సగం రెవిన్యూ కోల్పోయామని ధీరజ్ చెప్పారు. టైటిల్ లో బూతు ఉందని తాము అనుకోవడం లేదని, ఈ విషయంలో ఎవరిని కాంటాక్ట్ అవాలో తెలియడం లేదని, సెన్సార్ బోర్డు టైటిల్ సర్టిఫికేషన్ ఇస్తే బావుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి













