Varanasi: వారణాసికి భారీ VFX ఖర్చు
సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu), దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి(varanasi) సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు రాజమౌళి రాజీ పడకుండా ఖర్చు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనుల కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్‌ను రంగంలోకి దింపినట్టు సమాచారం. హాలీవుడ్ స్టాండర్డ్స్‌కు ఏమాత్రం తగ్గకుండా గ్రాఫిక్స్ వర్క్ ఉండాలని రాజమౌళి ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ప్రీ విజువలైజేషన్ దశ నుంచే భారీ బడ్జెట్‌ను కేటాయించినట్టు చెబుతున్నారు.
ఇండియా, కెన్యా అడవులు సహా ఏడు కంటే ఎక్కువ దేశాల్లో షూటింగ్ ను నిర్వహించనున్న ఈ సినిమా, టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్‌లో ఉండనుంది. ముఖ్యంగా ఐమాక్స్ కెమెరాలతో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడం సినిమాకు మరింత గ్రాండియర్ ను తీసుకొచ్చే అంశంగా భావిస్తున్నారు. అంతేకాదు, అడ్వాన్డ్స్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ, హై ఎండ్ CGI, రియలిస్టిక్ ఎన్విరాన్మెంట్ క్రియేషన్ కోసం ప్రత్యేక వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు సమాచారం. ఒక్క యాక్షన్ బ్లాక్‌కే వందలాది మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేస్తున్నారని తెలుస్తోంది.
ఇక బడ్జెట్ పరంగా వారణాసి కొత్త రికార్డులు సృష్టించేలా కనిపిస్తోంది. రెగ్యులర్ రెమ్యునరేషన్ తీసుకోకుండా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను ఎంచుకున్న రాజమౌళి నిర్ణయం కూడా చిత్రంపై ఉన్న నమ్మకానికే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న ఈ మూవీ, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియన్ సినిమాకు మరో మైలురాయిగా నిలవాలన్నదే జక్కన్న టార్గెట్ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.













