Naga Bandham: నాగబంధం టీజర్ వెనుక భారీ ప్లాన్?
ఎలాంటి సినిమాకైనా మంచి బజ్ రావాలంటే అది కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. మేకర్స్ రిలీజ్ చేసే ప్రమోషనల్ కంటెంటే సినిమాకు హైప్ ను తీసుకొస్తుంది. అలా రీసెంట్ గా ఓ సినిమా ఆడియన్స్ లో మంచి బజ్ ను తీసుకొచ్చేలా చేసింది. అదే నాగ బంధం(naga bandham). విరాట్ కర్ణ(Virat karna) హీరోగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది.
విరాట్ కర్ణ చేసింది ఒక్క సినిమానే అయినప్పటికీ, రెండో సినిమాకే భారీ బడ్జెట్ ను పెట్టి ఈ సినిమాను నిర్మిస్తున్నారు మేకర్స్. దానికి కారణం కూడా కంటెంటే. అలాంటి ఈ సినిమా గురించి ఇప్పుడు ఆడియన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్. మామూలుగా టీజర్ అంటే సినిమాలో గొప్పగా ఉండే కంటెంట్ ను చూపిస్తారు.
కానీ నాగబంధం టీమ్ టీజర్ ను ట్రైలర్ లాగా రిలీజ్ చేసింది. ట్రైలర్ లో ఎలా అయితే కథ, బ్యాక్ గ్రౌండ్ గురించి క్లారిటీ ఇస్తారో అలానే చేశారు. భారీ విజువల్స్, ఊహించని యాక్షన్ తో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సంభాషణలు లేకపోయినా ఈ మూవీ ఎలా ఉండబోతుందనేది ఆడియన్స్ కు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు డైరెక్టర్ అభిషేక్ నామా(Abhishek nama). ఏదేమైనా నాగబంధం టీమ్ చేసిన ప్లాన్ మాత్రం బాగానే వర్కవుటై అందరూ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు.













