Jana Nayagan: సెన్సార్‌తో చిక్కుల్లో విజయ్ మూవీ?
దళపతి విజయ్(Vijay) నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ జననాయగన్(jana nayagan) రిలీజ్ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజవాల్సి ఈ సినిమా సెన్సార్ వివాదాల కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో సెన్సార్ బోర్డుపై దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో రిలీజ్ కు రూట్ క్లియర్ అయిందని అందరూ భావించినప్పటికీ, విదేశీ డిస్ట్రిబ్యూషన్ వర్గాల ప్రకారం తాజా ప్రకటన కొత్త సందేహాలకు తావిచ్చింది.
కెనడాలోని ప్రముఖ పంపిణీ సంస్థ యార్క్ సినిమాస్(York cinemas) సోషల్ మీడియాలో చేసిన ప్రకటన ప్రకారం, జననాయగన్ ఏప్రిల్ 30కి ముందు రిలీజ్ కాదని స్పష్టం చేసింది. ఆల్రెడీ టికెట్లు బుక్ చేసిన ఆడియన్స్ రీఫండ్ కోసం థియేటర్లను సంప్రదించాలని సూచించింది. ఈ ప్రకటనతో విజయ్ అభిమానుల్లో నిరాశ నెలకొంది. తాజా పరిణామాలను బట్టి జననాయగన్ మూవీ సమ్మర్ సీజన్లో, ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతే రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే(Pooja hegde) హీరోయిన్గా నటించగా, మమిత బైజు(mamitha byju) కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే ప్రకాష్ రాజ్(prakash raj), బాబీ డియోల్(Bobby deol) ప్రధాన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ఈ మూవీకి సంగీతాన్ని అందించగా, కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) భారీ బడ్జెట్ తో జననాయగన్ ను నిర్మించింది. రివైజింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే జననాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి













