MG Group: కీ. శే శ్రీ మోహన్ వసంత్ కామత్ గారి మార్బుల్ విగ్రహావిష్కరణ
జహీరాబాద్ 14 ఫిబ్రవరి 2026: భారతదేశంలోని ప్రముఖ బస్ మరియు కోచ్ డిజైన్, ఇంజినీరింగ్ మరియు తయారీ సంస్థలలో ఒకటైన ఎంజీ గ్రూప్, జహీరాబాద్‌లోని తన సమగ్ర తయారీ సముదాయంలో 30 సంవత్సరాల కార్యకలాపాల పూర్తి సందర్భంగా ఒక ముఖ్యమైన మైలురాయిని జరుపుకుంది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కీ. శే శ్రీ మోహన్ వసంత్ కామత్ గారి స్మారకార్థంగా మార్బుల్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. భారతదేశ ఆధునిక బస్ బాడీ తయారీ పరిశ్రమలో ఆయన చేసిన విశేష కృషికి ఇది గౌరవ సూచకంగా నిలిచింది.
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శ్రీమతి సుధా మోహన్ కామత్, సహ-వ్యవస్థాపకురాలు & డైరెక్టర్, ఎంజీ గ్రూప్, శ్రీ అనిల్ మోహన్ కామత్, చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఎంజీ గ్రూప్, శ్రీమతి దేవికా అనిల్ కామత్, డైరెక్టర్, ఎంజీ గ్రూప్,పాల్గొని ఈ కార్యక్రమం సంస్థ స్థాపకుడి వారసత్వాన్ని స్మరించడమే కాకుండా, రెండవ తరం నాయకత్వం సంస్థను కొత్త దిశగా ముందుకు తీసుకెళ్తున్న సంకల్పాన్ని ప్రతిబింబించింది.
జహీరాబాద్ యూనిట్ 1996లో చిన్న సంస్థగా స్థాపించబడిన ఈ సంస్థ, మహీంద్రా & మహీంద్రా తమ ప్లాంట్ సమీపంలో బస్-బిల్డింగ్ యూనిట్ స్థాపించమని లేట్ శ్రీ కామత్ గారిని ఆహ్వానించడంతో ఈ ప్రయాణం ప్రారంభమైంది. ప్రభుత్వం వేలంలో కొనుగోలు చేసిన హ్యాక్సా బ్లేడ్ ఫ్యాక్టరీతో మొదలైన ఈ యూనిట్, మూడు దశాబ్దాల్లో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన బస్ మరియు కోచ్ తయారీ సముదాయాలలో ఒకటిగా అభివృద్ధి చెందింది.
ప్రస్తుతం జహీరాబాద్ సముదాయంలో ఎంజీ ఆటోమోటివ్స్, ఎంజీ బస్ & కోచ్, ఎంజీ కంపోజిట్స్,ఎంజీ గ్రే ఇంజిన్ యూనిట్లను కలిగియుంది. ఈ యూనిట్ ప్రముఖ ఓఈఎంలు, రాష్ట్ర రవాణా సంస్థలు (STUs) మరియు ప్రైవేట్ ఆపరేటర్లకు పాఠశాల రవాణా, సిబ్బంది & పట్టణ వినియోగం, మోఫుస్సిల్ & ప్రాంతీయ రవాణా, ప్రత్యేక ప్రయోజన వాహనాలు, అలాగే ప్రీమియం & ఇంటర్సిటీ కోచ్‌ల విభాగాలలో సేవలందిస్తోంది.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎంజీ గ్రూప్ సీఎండీ శ్రీ అనిల్ మోహన్ కామత్ గారు మాట్లాడుతూ “నా తండ్రి భారతదేశ ఆధునిక బస్-బాడీ తయారీ పరిశ్రమకు పునాది వేశారు. జహీరాబాద్‌లో ఆయన నిర్మించింది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు — ధైర్యం, క్రమశిక్షణ మరియు ప్రతిభతో కూడిన సంస్కృతి. 30 సంవత్సరాల ఈ మైలురాయిని చేరుకున్న ఈ సందర్భంలో మేము గతాన్ని మాత్రమే స్మరించుకోవడం కాదు; భారత రవాణా భవిష్యత్తుకు మా కట్టుబాటును మరింత బలోపేతం చేస్తున్నాం.”
“మేక్ ఇన్ ఇండియా” లక్ష్యాలకు అనుగుణంగా, జహీరాబాద్ ప్లాంట్ డిజైన్-కేంద్రిత ఇంజినీరింగ్ భాగస్వామిగా ఎంజీ గ్రూప్ స్థానాన్ని బలపరిచింది.
ఎంజీ గ్రూప్ తన భవిష్యత్ వృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది:
అధిక ఉత్పత్తి లైన్ల సమీకరణ:బెలగావి యూనిట్లో ఉన్న స్కూల్, స్టాఫ్, మోఫుస్సిల్ మరియు ఎకానమీ సెగ్మెంట్ ఉత్పత్తులను జహీరాబాద్‌కు మార్చి, అధిక ఉత్పత్తి తయారీకి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.
బెలగావి యూనిట్లో ప్రీమియం ఫోకస్: బెలగావి యూనిట్‌ను ప్రీమియం మరియు సూపర్-ప్రీమియం ఇంటర్సిటీ కోచ్‌ల తయారీలో ప్రత్యేకంగా కేంద్రీకరించనున్నారు.
జహీరాబాద్ విస్తరణ (2026):ప్లాంట్‌లో దశలవారీగా విస్తరణ చేపట్టనున్నారు. ఇందులో ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, ప్రాసెస్ ఆటోమేషన్, ఆధునిక పెయింట్-షాప్ & ట్రిమ్-లైన్ సదుపాయాలు, కంపోజిట్స్ మరియు తేలికపాటి నిర్మాణ సాంకేతికత మరియు స్థానిక కార్మికుల నైపుణ్యాభివృద్ధి
యూనిట్ల మధ్య సమన్వయం: డిజైన్, ఇంజినీరింగ్, కంపోజిట్స్, ఎలక్ట్రానిక్స్ మరియు తయారీ విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసి, ఓఈఎంలు మరియు రాష్ట్ర రవాణా సంస్థలకు వేగవంతమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాలు అందించనున్నారు.
ఎంజీ గ్రూప్ యొక్క తాజా వ్యూహం భారతదేశంలో పెరుగుతున్న పట్టణ మరియు ఇంటర్సిటీ రవాణా అవసరాలు, పాఠశాల మరియు ప్రాంతీయ వాహనాల పెరుగుతున్న డిమాండ్, భద్రత మరియు సుస్థిర డిజైన్‌పై పెరుగుతున్న దృష్టి, అలాగే ప్రభుత్వ మౌలిక వసతుల అభివృద్ధి ప్రోత్సాహానికి అనుగుణంగా ఉంది.
ఎంజీ గ్రూప్ సీఎండీ శ్రీ అనిల్ మోహన్ కామత్ గారు” “భారత ప్రయాణికుల రవాణా రంగం ఒక మార్పు దశలో ఉంది. లోతైన ఇంజినీరింగ్ సమన్వయం, బలమైన డిజైన్ సామర్థ్యం మరియు ఉత్పత్తి ప్రత్యేకతతో ఎంజీ గ్రూప్ భవిష్యత్తుకు సిద్ధమవుతోంది. మా తదుపరి వృద్ధి దశ వారసత్వం మరియు నవీనతపై ఆధారపడుతుంది.” అన్నారు:
వ్యవస్థాపక చైర్మన్ కీ. శే శ్రీ మోహన్ వసంత్ కామత్ మార్బుల్ విగ్రహావిష్కరణ అనంతరం నివాళి చిత్ర ప్రదర్శన నిర్వహించబడింది. సంస్థతో దశాబ్దాలుగా పనిచేసిన సీనియర్ నాయకులు తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమం వృక్షారోపణతో ముగిసింది, జహీరాబాద్ ప్రజలతో సంస్థ కొనసాగుతున్న భాగస్వామ్యాన్ని ఇది ప్రతిబింబించింది.













