Nara Lokesh: బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి పర్యటనలో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ ఛైర్మెన్ బిల్ గేట్స్ కు స్వాగతం పలికిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్, అధికారులు. గన్నవరం విమానాశ్రయం నుండి సచివాలయంకు బయలుదేరిన బిల్ గేట్స్, మంత్రుల బృందం.
గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌తో సచివాలయంలో చర్చలు సాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ వెల్లడించారు. ప్రధానంగా ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల బలోపేతం చేసే అంశాలపై చర్చ సాగుతున్నట్లు మంత్రి అన్నారు. సాంకేతిక ఆధారిత పరిపాలన రంగంలో భాగస్వామ్యాల బలోపేతంపై చర్చ సాగుతున్నట్లుగా పేర్కొన్నారు.













