Mayor Seats: పార్టీ మార్పులతో మారిన సమీకరణాలు
తెలంగాణ పురపాలక పోరు ముగిసి పీఠాల వేట (Mayor Seats) మొదలైన వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో వింత పోకడలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఛైర్మన్, మేయర్ పదవుల కోసం సిద్ధాంతాలను పక్కనపెట్టి ప్రత్యర్థి పార్టీలు సైతం చేతులు కలుపుతుండటం విశేషం. రాష్ట్ర స్థాయిలో నిత్యం కత్తులు దూసుకునే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు కొన్ని మున్సిపాలిటీల్లో అధికారం కోసం లోపాయికారి ఒప్పందాలకు తెరలేపుతున్నాయి. హంగ్ ఏర్పడిన చోట్ల ఎలాగైనా పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా ‘ఏకీకృత మంత్రాన్ని’ జపిస్తూ అపవిత్ర పొత్తులకు సైతం వెనకాడటం లేదు.
అధికార కాంగ్రెస్ పార్టీ (Congress) మెజారిటీ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి స్వతంత్రులను, ఇతర పార్టీల అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గకుండా వ్యూహాత్మకంగా (Mayor Seats) అడుగులు వేస్తోంది. తమకు బలం లేని చోట్ల కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లను సైతం మచ్చిక చేసుకునేందుకు లోలోపల మంతనాలు సాగిస్తోంది. ఇక బీజేపీ కొన్ని స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉన్నా, లోకల్ సమీకరణాలు మారుతుండటంతో సందిగ్ధంలో పడింది.
కొన్ని పురపాలికల్లో కనిపిస్తున్న వింత పొత్తులు (Mayor Seats) రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. కొత్తగూడెంలో పదవీకాలాన్ని పంచుకోవాలని కాంగ్రెస్, సీపీఐ ఒప్పందం చేసుకోగా.. అదే సీపీఐ క్యాతనపల్లిలో మాత్రం బీఆర్ఎస్కు మద్దతివ్వడం గమనార్హం. ఆదిలాబాద్‌లో బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కౌన్సిలర్లు ఏకం కావడం చర్చనీయాంశమైంది. నారాయణపేటలోనూ కమలం పార్టీని అడ్డుకోవడానికి హస్తం, కారు పార్టీలు కలిసే ప్రయత్నం చేస్తున్నాయి. బెల్లంపల్లిలో ఇరుపక్షాల బలం సమానంగా ఉండటంతో స్వతంత్రులు కింగ్ మేకర్లుగా (Mayor Seats) మారారు. అమరచింతలో అయితే విచిత్రంగా బీఆర్ఎస్, బీజేపీలు జట్టు కట్టడం విశేషం.
ఇవి కూడా చదవండి
జనగామలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి బలాలు సమానంగా ఉండటంతో అక్కడ ఎక్స్ అఫీషియో ఓట్లు, స్వతంత్రుల మద్దతు అత్యంత కీలకంగా మారింది. వర్ధన్నపేటలో బీఆర్ఎస్ ఎక్కువ వార్డులు గెలిచినా, ఎక్స్ అఫీషియో ఓటుతో కాంగ్రెస్ పీఠం దక్కించుకునేలా కనిపిస్తోంది. మహబూబాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ తెలివిగా స్వతంత్రులను చేర్చుకుని తన బలాన్ని 21కి పెంచుకోవడంతో విజయం లాంఛనమైంది. కరీంనగర్లో మేయర్ పీఠం కోసం హైడ్రామా నడుస్తోంది. అటు అలంపూర్‌లో ఎమ్మెల్యే అండతో బీఆర్ఎస్ (Mayor Seats) ధీమాగా ఉంది. మొత్తానికి గెలుపు కోసం పరస్పర విరుద్ధ పార్టీలు సైతం జతకట్టడం చూస్తుంటే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే మాట అక్షర సత్యమనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి













