Accident Insurance: రోజుకు కేవలం ₹8.20 ఖర్చుతో రూ.60 లక్షల బీమా!
Accident Insurance: సామాన్యుల ఆర్థిక భద్రతే లక్ష్యంగా దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక సంచలన బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోజుకు కేవలం రూ. 8.20 (ఏడాదికి రూ. 3,000) వెచ్చిస్తే చాలు.. ఏకంగా రూ. 60 లక్షల భారీ ప్రమాద బీమా కవరేజీని అందిస్తోంది. ఊహించని విపత్తులు సంభవించినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు ఎస్బీఐ కల్పిస్తున్న ఈ రక్షణ కవచం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాలు:
ఈ కొత్త ప్రమాద బీమా పథకం కింద ఖాతాదారులు ఏడాదికి ఒకసారి రూ. 3,000 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాంకులో ఒకసారి అంగీకార పత్రం సమర్పిస్తే, ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ రిన్యువల్ (Auto-renewal) పద్ధతిలో మీ ఖాతా నుంచే సొమ్ము జమ అవుతుంది.

ప్రయోజనాలు:
విస్తృత కవరేజీ: రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలే కాకుండా పాముకాటు వంటి దురదృష్టకర సంఘటనల వల్ల మరణించినా ఈ బీమా వర్తిస్తుంది.
కుటుంబానికి అండ: పాలసీదారుడు మరణిస్తే నామినీ ఖాతాలో రూ. 60 లక్షలు జమ చేయడంతో పాటు, ఇద్దరు పిల్లల చదువుల కోసం అదనంగా రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తారు.
అదనపు ఖర్చులు: అంత్యక్రియల నిమిత్తం రూ. 10,000, అంబులెన్స్ ఖర్చుల కోసం రూ. 1,500 అందజేస్తారు.
నిబంధనలు:
అయితే, ఈ బీమా కేవలం ప్రమాదవశాత్తు జరిగే మరణాలకు మాత్రమే పరిమితం. ఆత్మహత్యలు, మాదకద్రవ్యాల సేవనం వల్ల జరిగే మరణాలు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే సహజ మరణాలకు ఈ పథకం వర్తించదు.
మీ కుటుంబానికి ఇంతటి భారీ రక్షణ కల్పించుకోవడానికి మీ సమీప ఎస్బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి ఈ పథకంలో చేరవచ్చు.













