Mega158: చిరూ మూవీలో ప్రీతి?
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) హీరోగా రూపొందిన సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర(viswambhara) రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరూ మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించనుండగా, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన బ్లాక్‌బస్టర్ దర్శకుడు కొల్లి బాబీ(kolli bobby) తో మరో భారీ ప్రాజెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, కథా చర్చలు, నటీనటుల ఎంపిక వంటి పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్(preethi mukundan) ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రకు ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా కన్నప్ప(Kannappa) మూవీలో కనిపించిన ప్రీతి, ఈసారి మెగాస్టార్‌కు కూతురి పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆస్కార్ విజేత రెహమాన్(Rahman) ను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) సంస్థ నిర్మించనుంది. మెగాస్టార్-బాబీ కాంబినేషన్ లో ఆల్రెడీ వాల్తేరు వీరయ్య(Waltair veerayya) లాంటి బ్లాక్‌బస్టర్ వచ్చిన నేపథ్యంలో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై పరిశ్రమలోనూ, అభిమానుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది.













