India AI Summit: ప్రధాని చేతుల మీదుగా ఆరంభం కానున్న ఇండియా ఏఐ సమ్మిట్
భారత్‌ను గ్లోబల్ డేటా హబ్‌గా (India AI Summit) మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలో ఏర్పాటయ్యే డేటా సెంటర్లు యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించడమే కాకుండా, ప్రపంచంలోని మొత్తం డేటాను మన దేశానికి రప్పిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’, ‘ఇండియా ఇంపాక్ట్ ఎక్స్పో’ నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచుతూ, పటిష్టమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎకోసిస్టమ్‌కు పునాదులు వేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రపంచ దేశాల డేటాను (India AI Summit) భద్రపరిచేందుకు భారత్ సాదరంగా ఆహ్వానిస్తోందన్నారు. గతేడాది నాటికి ఏడు ప్రధాన నగరాల్లో 1.5 గిగావాట్లుగా ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యాన్ని, ఈ ఏడాది చివరికల్లా 1.7 గిగావాట్లకు చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి
ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చాలంటే, స్వదేశంలో నిల్వ చేసిన డేటా ఆధారంగా క్లౌడ్, ఏఐ సేవలను విస్తరించడం అత్యవసరమని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్‌లో డేటా సెంటర్లు ఏర్పాటు చేసి ప్రపంచానికి సేవలందించే సంస్థలకు 2047 వరకు ‘ట్యాక్స్ హాలిడే’ (పన్ను మినహాయింపు) ఇస్తామని ఇటీవలి బడ్జెట్లో కేంద్రం బంపరాఫర్ ప్రకటించింది. దీనికి ఆకర్షితమై గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
ఇక ఈ సమ్మిట్‌తో (India AI Summit) పాటే ప్రారంభమయ్యే ‘ఇండియా ఏఐ ఎక్స్పో’లో పీపుల్, ప్లానెట్, ప్రోగ్రెస్ థీమ్‌తో 300కు పైగా లైవ్ డెమోలు, ఎగ్జిబిషన్లు ఉండనున్నాయి. 600కు పైగా స్టార్టప్‌లు, 13 దేశాల పెవిలియన్లతో పాటు 3,250 మందికి పైగా వక్తలు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌ను సుమారు 2.5 లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ప్రపంచ ఏఐ రంగంలో కొత్త భాగస్వామ్యాలు, వ్యాపార అవకాశాలను సృష్టించడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.
ఇవి కూడా చదవండి












