lenin: పెద్ది కోసం లెనిన్ వెనక్కి వెళ్లాల్సిందేనా?
యంగ్ హీరో అఖిల్(akhil) నటిస్తున్న లెనిన్(lenin) సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి(murali kishore abburi) డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదట మే 1, 2026న విడుదల కానుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన తాజా పోస్టర్లో రిలీజ్ డేట్ లేకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విడుదల తేదీని హైలైట్ చేసే టీమ్, ఈసారి దాన్ని మినహాయించడం వెనుక వ్యూహాత్మక నిర్ణయం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) నటిస్తున్న పెద్ది(peddi) ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతుండ టంతో బాక్సాఫీస్ సమీకరణాలు మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భారీ స్థాయిలో విడుదలయ్యే పెద్ది ప్రభావం మే 1న రానున్న చిత్రాలపై పడే అవకాశం ఉండటంతో లెనిన్ టీమ్ తమ రిలీజ్ ప్లాన్ను పునర్విమర్శిస్తున్నట్టుగా సమాచారం. అందుకే కొత్త పోస్టర్లో తేదీ ప్రస్తావన లేదని అంటున్నారు.
రాయలసీమ బ్యాక్డ్రాప్లో, చిత్తూరు ప్రాంత నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే (bhagyasri borse) హీరోయిన్గా నటిస్తోంది. గత చిత్రాలతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన అఖిల్, ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఔట్పుట్ పై చిత్ర యూనిట్ విశ్వాసంగా ఉండటంతో, సరైన విడుదల తేదీ ఎంపికే ఇప్పుడు కీలకంగా మారింది. పెద్ది కోసం లెనిన్ వెనక్కి వెళ్లాల్సిందేనా? అన్న ప్రశ్నకు సమాధానం త్వరలోనే లభించనుంది.













