Adhurs: అదుర్స్ సీక్వెల్ జరిగే పనేనా?
టాలీవుడ్ లోని మంచి యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్లలో ప్రత్యేక స్థానం సంపాదించిన సినిమాల్లో అదుర్స్(adhurs) కూడా ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) ఈ సినిమాలో డబుల్ రోల్ చేశాడు. ఇందులో ఎన్టీఆర్ చేసిన చారి క్యారెక్టర్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. తారక్ డబుల్ రోల్ లో నటించిన అదుర్స్ ఆయన కెరీర్లో మంచి హిట్ గా నిలిచింది.
ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్, కామెడీ మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. సినిమాకు డైలాగ్ రైటర్‌గా పని చేసిన కోన వెంకట్(kona venkat) రెగ్యులర్ గా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సీక్వెల్‌పై ఆశలు పెంచుతూ, ఇప్పటికే అర గంట స్టోరీ కూడా రెడీగా ఉందని చెప్పారు.
అయితే ప్రస్తుతం తారక్ కు ఉన్న భారీ మార్కెట్, స్టార్డమ్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతుందా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వరుస పాన్-ఇండియా చిత్రాలతో బిజీగా ఉండటంతో ఈ సీక్వెల్ సాధ్యాసాధ్యాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అదుర్స్ 2(Adhurs2) ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో లేదో అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్(Dragon) మూవీతో బిజీగా ఉన్నాడు.













