Hit3: హిట్3లో ఇద్దరు యంగ్ హీరోలు
సరిపోదా శనివారం(Saripoda Sanivaram) హిట్ తర్వాత నాని(nani) నటిస్తున్న సినిమా హిట్ ది థర్డ్ కేస్(Hit: the third case). శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నాని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. శ్రీనిథి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 1 న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. బ్రూటల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
హిట్ ఫ్రాంచైజ్ సిరీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మంచి రెస్పాన్స్ అందుకోవడంతో హిట్3ను మరింత గ్రాండ్ గా తెరకెక్కస్తున్నాడు డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu). హిట్3 నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అర్జున్ సర్కార్ గా నాని పోలీస్ పాత్రలో కనిపించనున్నట్టు హిట్2(Hit2) క్లైమాక్స్ లోనే క్లారిటీ ఇచ్చారు. నాని తన కెరీర్లోనే మొదటిసారిగా పోలీస్ పాత్రలో కనిపించనున్న సినిమా ఇది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. హిట్3 లో నానితో పాటూ మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా కనిపించనున్నారని సమాచారం. హిట్ ఫస్ట్ కేస్(Hit The First Case) లో నటించిన అడివి శేష్(Adivi Sesh)తో పాటూ సెకండ్ కేస్ లో నటించిన విశ్వక్ సేన్(viswaksen) ఈ సినిమాలో కనిపించనున్నారట. ఈ ఇద్దరు యంగ్ హీరోలు హిట్3లో స్పెషల్ పాత్రలు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే మాత్రం సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.













