రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ.10.25 కోట్ల బిజెనెస్ ను చేయగా, వరల్డ్ వైడ్ గా రూ.13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఫంకీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద రూ.14 కోట్లు షేర్, రూ.28 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. కానీ ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.7.5 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది.
మొదటి మూడు రోజులూ ఫంకీ బాగానే పెర్ఫార్మ్ చేసింది కానీ సోమవారం నుంచి ఈ సినిమా బుకింగ్స్ బాగా డ్రాప్ అయినట్టు సమాచారం.
నాలుగో రోజు కూడా లెక్కలోకి వేసుకుంటే ఫంకీ మొత్తమ్మీద సుమారు రూ.8.5 కోట్లు కలెక్ట్ చేసే అవకాశముంది.
ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.9.5 కోట్ల షేర్, రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.
ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, వారం రోజుల తర్వాత కూడా ఫంకీకి గట్టి పుంజుకోవడం కష్టమేనని అంటున్నారు. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రావడం, కొత్త సినిమాల రిలీజ్లు ఉండటం ఫంకీ కలెక్షన్లపై ప్రభావం చూపిస్తున్నాయి.
అయితే వీకెండ్లో ఫ్యామిలీ ఆడియన్స్ కొంత మేరకు థియేటర్లకు వచ్చే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు ఆశిస్తున్నారు. ఓటీటీ డీల్, శాటిలైట్ రైట్స్ ద్వారా కొంత నష్టం కవర్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.