ఫాల్గుణ అమావాస్య సూర్య గ్రహణం..జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఇవే..

17th February 2026

White Scribbled Underline

హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రహణ కాలం ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతుందని నమ్మకం.

2026 ఫిబ్రవరి 17న సంభవించే సూర్య గ్రహణం కొన్ని రాశుల వారికి పరీక్షల కాలంగా మారవచ్చు. ఈ సమయంలో శాంతంగా, జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

సింహ రాశి వారికి పనుల్లో ఆలస్యం, అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండి, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

సింహం

కన్య రాశి వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఒత్తిడి పెరగవచ్చు. కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు.

కన్య

వృశ్చిక రాశి వారికి కుటుంబ విషయాల్లో ఆందోళనలు రావచ్చు. ఆస్తి, పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

వృశ్చికం

కుంభ రాశి వారికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు, పెట్టుబడుల విషయంలో నియంత్రణ అవసరం.

కుంభం

మీన రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఓపికగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో లాభం ఇస్తాయి.

మీనం