US: అమెరికా వీసా ఇంటర్వ్యూ లో సోషల్ మీడియా పరిశీలన
గత సంవత్సరం 2025లో ట్రంప్ పాలకవర్గం ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థుల వీసా అనుమతి ఇచ్చే విధానంలో తప్పనిసరిగా వారివారి సోషల్ మీడియా పరిశీలన (సోషల్ మీడియా వెట్టింగ్) ఉంటుందని చెప్పింది. ఆ పరిశీలన కార్యక్రమంలో వీసా కార్యక్రమంకు ఎక్కువ సమయం పట్టడం, అనేకమందికి వీసా ఇంటర్వ్యూల ప్రక్రియకి చాలా సమయం పట్టడం, కొంతమంది విద్యార్థులకు ఈ ఆలస్యం వలన అవకాశాలు పోవడం జరిగాయని వార్తలు విన్నాము. అలాగే ఆ ప్రక్రియ పూర్తి అయ్యాక కొంతమందికి వీసా అనుమతి తిరస్కరించారని కూడా తెలిసింది.
అయితే ఈ సోషల్ మీడియా పరిశీలన కేవలం F వీసా (విద్యార్థులకు ఇచ్చే వీసా), వీ1 వీసా వొకేషనల్ స్టడీస్ కు వచ్చే విద్యార్థులకు ఇచ్చేది, జీ1 వీసా (రీసెర్చ్ అండ్ టీచింగ్ లాంటి వివిధ రంగాల్లో జరిగే ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్లకు ఇచ్చే వీసాలకే) పరిమితం అని అనుకున్నారు.
15 డిసెంబర్ 2025న ట్రంప్ ప్రభుత్వం ఈ సోషల్ మీడియా పరిశీలనను H1 B వీసా అభ్యర్థులకు కూడా వర్తిస్తుందని ప్రకటించింది. సాధారణంగా హెచ1బి వీసా అనేది వివిధ రంగాల్లో ఉద్యోగం చేయడానికి ఇచ్చే వీసా అని, మొదటిగా 3 సంవత్సరాలకు ఇస్తారని, తరువాత ఇంకో 3 సంవత్సరాలకు పెంచుతారని అందరికీ తెలుసు. అలాగే కంపెనీ వారు పెట్టిన అభ్యర్థన ప్రకారం హెచ్ 1 బి వీసా ఆమోదం తెలుపుతారని, ఆ వీసా ఆమోదం వచ్చిన వ్యక్తి వీసా ఇంటర్వ్యూకి వెళ్లి పూర్తిస్థాయి ఆమోదం పొంది స్టాంపింగ్ వేసుకోవాలని కూడా తెలిసిన విషయమే. ఆ విధంగా వీసా ఇంటర్వ్యూ ఫిక్స్ చేసుకుని ఇండియాకి వచ్చిన అనేకమందికి వారి వారి వీసా ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్లను సడెన్గా రద్దు చేశారు. మళ్ళీ 2026 జూన్ వరకు వీసా ఇంటర్వ్యూలు ఉండవని చెప్పడంతో అందరూ అనేక ఇబ్బందులకు గురయ్యారని కూడా తెలుసుకున్నాము. ఆ తరువాత ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ప్రాసెస్ చాలా సమయం తీసుకుంటోందని 2027 సమ్మర్ వరకు ఇంటర్వ్యూలు ఇవ్వడం సాధ్యం కాదని కూడా పత్రికాముఖంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.
ఈ హఠాత్ పరిణామానికి ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు, వారి కుటుంబాలతోపాటు జనరల్ పబ్లిక్ అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉండగానే టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబార్ట్ 27 జనవరి 2026న కొత్త ఆర్డర్ తీసుకువచ్చారు. ఈ ఆర్డర్ ప్రకారం టెక్సాస్ రాష్ట్రంలో 31 మే 2027 వరకు ఎలాంటి హెచ్ 1బి వీసాలు ఇవ్వబడవని ఒక నిషేధం విధించారు. స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలు, యూనివర్సిటీలు కూడా హెచ్ 1 బి వీసాల ప్రతిపాదనలు పంపరాదన్నారు. ఈ నిర్ణయం అమెరికాలోని అన్నీ రాష్ట్రాల్లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీనే కాకుండా, అనేకమంది ప్రభుత్వ అధికారులను కూడా ఆశ్చర్యపరిచింది. టెక్సాస్ గవర్నర్ ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా ఉంది. టెక్సాస్ రాష్ట్రంలో ఇప్పటికే ముస్లింలు, ఇండియన్స్ ఎక్కువ అయిపోయారని, ఈ రాష్ట్రంలో హెచ్ 1 బి వీసాలలో కొన్ని అవకతవకలు జరిగాయని ఒక రాజకీయ నాయకురాలు, మాజీ మేయర్ టేలర్ గ్రీన్ ప్రకటన చేయడం సంచలనం కలిగించింది. ఈ ప్రకటనతో గవర్నర్ గ్రెగ్ నిర్ణయంతో ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అతి పెద్ద ఇస్యూగా తయారైంది. ఈసమయంలో ప్రభుత్వం చేస్తున్న పనులు తప్పా, రైటా అనే చర్చలు బదులు, చేయాల్సిన కార్యక్రమాలు, చేపట్టవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకోవడం మంచిది.
H1B వీసా అనుమతికి తమ కంపెనీ నుంచి ఏ ఉద్యోగినైనా పంపుతున్నప్పుడు, కంపెనీ వారు కూడా వారి సోషల్ మీడియా అకౌంట్ పరిశీలించి, అభ్యంతరకర రహితంగా ఉంచుకోవాలి. “మా దేశానికి చదువుకోవడానికి, లేదా ఉద్యోగం – వ్యాపారం చేయడానికి వచ్చి, మా దేశ రక్షణ వ్యవస్థ గురించి అభ్యంతకర పోస్ట్ లు పెట్టడం తప్పు. అలాంటి వ్యక్తులు మా దేశానికి రావడానికి మేము అంగీకరించం” అని ఆ దేశ అధ్యక్షుడే అన్నారు. Letµs respect the Governmentµs policy and letµs take precautions and make necessary corrections అని ఒక పెద్దాయన అన్నమాట మనం విందాం.
హెచ్ 1 బి వీసా అభ్యర్థులు అయినా హెచ్ 1 బి వీసా మీద ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు అయినా, అమెరికాలో చదువుకోవడానికి వద్దామనుకునే విద్యార్థులు అయినా, కొన్ని విషయాల్లో శ్రద్ధ పెట్టాలి. మొదటగా ఫెడరల్ గవర్నమెంట్ చెబుతున్న పాయింట్స్ తెలుసుకుందాము.
* వీసాకి వెళ్ళే ప్రతి అభ్యర్థి ఆమె తమ సోషల్ మీడియా అకౌంట్స్ (వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర) ఇన్ఫర్మేషన్ డిస్ క్లోజర్ తప్పనిసరిగా ఉంచాలి. వాటిని ప్రైవేట్ చేయకూడదు.
* తమ తమ ప్రొఫైల్ ని పబ్లిక్ చేసుకోవాలి.
* ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్లు ప్రతి అప్లికెంట్స్ కి గతంలో చేసిన ఉద్యోగాలు, చదువులు, ఎక్కడెక్కడ ఉండేవారు లాంటి అన్నీ విషయాలు పరిశీలిస్తారు.
* ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పద్ధతిగా ఉంచాలి. అస్థిరమైన వివరాలు (ఱఅcశీఅsఱstవఅt ఱఅfశీతీఎatఱశీఅ) ఉంటే అభ్యంతరమే.
* గతంలో చేసిన ఉద్యోగాలు, స్నేహితులు, తిరిగిన ప్రదేశాలు లాంటి అనేక విషయాలను కూడా పరిశీలిస్తారు.
ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం వలన వీసా ప్రక్రియ చాలాసమయం తీసుకుంటోంది. వీసా ఇంటర్వ్యూకి వేళబోయే వ్యక్తి తనకు తెలీకుండా తన ఫేస్ బుక్ అకౌంట్ లలో ఎవరైనా అభ్యంతరకరమైన వ్యక్తి స్నేహితుడుగా ఉండటం, ఆ వ్యక్తి దేశ వ్యవస్థను విమర్శించడం లేదా, దేశ యంత్రాంగానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులకు మద్దతు తెలపడంవలన, వీసాకి వెళ్ళబోతున్న వ్యక్తిని కూడా అభ్యంతరకరమైన వ్యక్తిగా నిర్ణయిస్తున్నారు. అందువలన అమెరికాకి వెళ్ళడానికి వీసాకోరుకునే వ్యక్తులు అందరూ ఈ విషయంపై శ్రద్ధ పెట్టి వారి వారి సోషల్ మీడియా అకౌంట్స్ క్లీన్గా ఉంచుకోవాలి.
స్టూడెంట్స్ వీసా కోరుకునేవారు కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి. స్టూడెంట్స్ తరుపున వారి తల్లి తండ్రులు కూడా వారి సోషల్ మీడియా అకౌంట్ పరిశీలించి, ఎలాంటి అభ్యంతరకర పోస్టులు తొలగించి, ఆయా వ్యక్తులను కూడా తొలగించి తమ తమ అకౌంట్ మంచి గా అభ్యంతకర రహితంగా ఉండేలా చూసుకోవాలి.













