Aaya Sher: నానిని అలా ప్రెజెంట్ చేయబోతున్న శ్రీకాంత్
నేచురల్ స్టార్ నాని(nani) బర్త్ డే సెలబ్రేషన్ ఈ సారి మ్యూజిక్ తో నిండిపోనున్నాయి. ఆయన నటిస్తున్న తాజా సినిమా ది ప్యారడైజ్(the paradise) నుంచి ఫస్ట్ సాంగ్ ఆయా షేర్(aaya sher) ను ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ గా ఈ సాంగ్‌ను రిలీజ్ చేయాలని నిర్ణయించిన మేకర్స్, దీనిని పవర్ఫుల్ ఇంట్రడక్షన్ సాంగ్ గా రూపొందించినట్లు సమాచారం. ఈ సాంగ్ ద్వారా నానిని లార్జర్ దెన్ లైఫ్ అవతార్‌లో చూపించబోతున్నారని తెలుస్తోంది.
ఆయా షేర్ సాంగ్ కోసం స్పెషల్ గా భారీ సెట్‌ను నిర్మించి, వందలాది డ్యాన్సర్లతో గ్రాండ్‌గా షూట్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాకు ఉన్న తీవ్రత, మాస్ టోన్‌కు సరిపడేలా ఈ నంబర్‌ను డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh ravichander) హై వోల్టేజ్ బీట్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్లు టాక్. అదే విధంగా కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్(sudhan master) మాస్ స్టెప్పులతో నాని ఎనర్జీని హైలైట్ చేసే విధంగాస్టెప్పులను కంపోజ్ చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ రిలీజైన వెంటనే అభిమానులతో కనెక్ట్ అయి సినిమాపై అంచనాలను పెంచుతుందని యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమాను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(srikanth odela) తెరకెక్కిస్తుండగా, నిర్మాత సుధాకరి చెరుకూరి(sudhakar cherukuri) SLV సినిమాస్(SLV Cinemas) బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే మంచి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఆగస్టు 21న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతుంది. నాని బర్త్‌డే సందర్భంగా Aaya Sher సాంగ్ తో ది ప్యారడైస్ ప్రమోషన్స్‌ను గ్రాండ్ గా మొదలు పెట్టనున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ మాస్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి













